Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి

గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేసవి దృశ్య గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వేసవి ఎండలు ముదిరిన నైపథ్యంలో ఇక్కడ కూడా ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడకుండా పంచాయతీ కార్యదర్శులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడైనా తాగునీటి బోరు బావుల్లో ఇబ్బంది ఉంటే తక్షణమే మరమ్మత్తులు చేయించాలన్నారు.

పైప్ లైన్ లీకేజీలు ఉంటే వాటిని కూడా మరమ్మత్తులు చేయించాలన్నారు. ప్రజలు ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ పై పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 20 నాటికి పెద్ద ఎత్తున ఇందిరమ్మ గృహప్రవేశాలు జరిగేలా కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీవో విద్యానంద్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -