Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘కొత్త సినిమా’.. స్ఫూర్తిదాయక ప్రయత్నం

‘కొత్త సినిమా’.. స్ఫూర్తిదాయక ప్రయత్నం

- Advertisement -

సినిమా పట్టణంలోనే కాదు పల్లెపల్లెనా ఉంటుందని నిరూపిస్తూ కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా ‘కొత్త సినిమా’. ఈ సినిమాతో వంద మంది న్యూ టాలెంట్ టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం. సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ ఈవెంట్ను పలువురు దర్శక, నిర్మాతలు అతిథులుగా ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ,‘కొత్త వాళ్లం ఎవరూ సపోర్ట్ చేయరని అను కున్నాం. కానీ మా సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమా అనేది ప్రపంచంలో బలమైన మాధ్యమం. ఇలాంటి ప్రభావవంతమైన సినిమాను నేను కూడా రూపొందించాలనే ప్రయత్నం ఈ చిత్రంతో మొదలు పెట్టాను. రోజూ ఏదో ఒక పని పూర్తి చేశాననే సంతృప్తితోనే ఉండేవాడిని. నా కథతో వేరే ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్లకుండా నేనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. నేను కొత్త, నాతో పాటు కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తామంటే ఎవరూ నమ్మలేదు. కానీ మా ఊరిలోనే ఆడిషన్స్ చేసి టాలెంట్ ఉన్నవారిని తీసుకున్నాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అలా ఈ సినిమా మేకింగ్ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాం.

త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతున్నాం’ అని తెలిపారు. ‘అజర్ ఈ సినిమా టైటిల్ కొత్త సినిమా అని పెట్టడమే కాదు కొత్త ప్రయత్నం కూడా చేశాడు. అందరూ మేల్ ఆర్టిస్టులతో చేసిన మొదటి సినిమా ఇదే కావొచ్చు. సినిమా మేకింగ్ అంటే ఖర్చు, ఆర్టిస్టులు కూడా ఈజీగా దొరకరు. అందుకే అజర్ ఊరిలో టాలెంట్ ఉన్న వారిని చూసుకుని, సినిమా రూపొందించాడు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా చేసి ఉంటాడని నమ్ముతున్నాను’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. దర్శక, నిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ,‘అజర్‌ ఈ చిత్రంతో ఒక సహజమైన సినిమా, ఒక మంచి సినిమా చేసి ఉంటాడని భావిస్తున్నా’ అని తెలిపారు. ‘మనకు ఎవరో అవకాశం ఇవ్వలేదని బాధపడుతూ, ఎవరో మనల్ని తొక్కేశారని నిందించడం తప్పు. అలాంటి వాళ్లు అజర్ను స్ఫూర్తిగా తీసుకోవాలి’ అని డైరెక్టర్ వీరశంకర్ చెప్పారు. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ,‘దర్శకులకు కాన్ఫిడెన్స్ ఊపిరి లాంటిది. నా కథలో హీరో ఒక భాగం అనే నమ్మే ఆత్మవిశ్వాసం వారిలో ఉండాలి. నేను నా కెరీర్ లో అలాంటి కాన్ఫిడెన్స్ తోనే కొనసాగాను. దర్శకుడు అజర్ లో కూడా అలాంటి ఆత్మవిశ్వాసమే కనిపిస్తోంది. కొత్త సినిమా కంటెంట్ క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా ఉంది. ఈ చిత్రంతో అజర్ డైరెక్టర్ గా సక్సెస్ కావాలి. అలాగే ఇందులో నటించిన అందరికీ మంచి పేరు రావాలి’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -