Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదివేల మెట్రిక్ టన్నుల గిడ్డంగుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

పదివేల మెట్రిక్ టన్నుల గిడ్డంగుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
రైతుల శ్రేయస్సే ప్రజాప్రభుత్వం ధ్యేయమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. గురువారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల నిర్మాణానికి, ఆసంస్థ కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి భూమిపూజ నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈగిడ్డంగుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో ప్రజలే పాలకులని, రైతులే రాజులని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో గోదాముల నిర్మాణాన్ని పూర్తిచేసి రైతులకు లాభం చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గడిచిన రెండు సంవత్సరాలలో కోటి రూపాయలపైగా వెలుగుపల్లి  గ్రామాభివృద్ధికి వ్యయం చేసినట్లు తెలిపారు. మద్దిరాల, నూతనకల్ మండలాల విద్యార్థుల కోసం రెండు మండలాలకు అందుబాటులో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలో గిడ్డంగుల నిర్మాణం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.

తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల అభివృద్ధి కోసం, పార్టీ శ్రేణులకు అండగా ఉండటానికి తన తండ్రి చూపిన మార్గంలో పయనిస్తానని సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. తండ్రి దామోదర్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేశారని, అదే బాటలో ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యోగానంద చారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, జిల్లా నాయకులు రేగటి రవి, స్థానిక సర్పంచ్ సోలిపురం అశ్విని కన్నా రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జోహార్,యూ త్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బండరామారం సర్పంచ్ కోరుకొప్పుల నరేష్, మండల సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్, ఎంపీడీవో శేషు కుమార్, తహసీల్దార్ దయానందం మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -