Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధార నిలిసిన వాగులు.. మానేరు

ధార నిలిసిన వాగులు.. మానేరు

- Advertisement -

తాగునీటి కోసం అల్లాడుతున్న ముగాజీవాలు
నిరుపయోగంగా నీటి తొట్టిలు
నవతెలంగాణ – మల్హర్ రావు

రోజురోజుకు మండుతున్న ఎండలతో మండలంలో వాగులు, మానేరు, ఒర్రెలు పూర్తిగా తడి అరిపోయాయి. అడవిలో ఉన్న చెక్ డ్యామ్స్ పూర్తిగా ఎండిపోయాయి. ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు సైతం ఎండిపోవడంతో మూగజీవాలైన గొర్రెలు, మేకల, గెదలకు నీరు తాగించడానికి నానా కష్టాలు పడుతున్నామని కాపర్లు, రైతులు వాపోతున్నారు. మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో దాదాపు పశు వైద్యాధికారుల వివరాల ప్రకారం 10069 (గేదెలు 7358, 2 2711) ລ້, 34000 , మేకలు ఉన్నాయి.

ఇప్పటి వరకు చెరువులు, బావుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో మూగ జీవాల దాహార్తి తీర్చేందుకు ఇబ్బందులు పడలేదు. కానీ వేసవికాలం ప్రారంభమవుతుండగా భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. మండలంలోని నీటి కుంటలు, వాగులు, చెరువులు ఏప్రిల్లో ఎండిపోయేవి కానీ ఈ సంవత్సరం మార్చిలోనే అడుగంటి పోయాయి. దీంతో తాగేందుకు నీరులేక పశువులు అల్లాడుతున్నాయి. ఎండ తీవ్రత అధికం కావడంతో బోరు బావుల్లో ఉన్న కొద్దిపాటి భూగర్భ జలం పాతాళానికి చేరుకుంది. వేసవిలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

నిరుపయోగంగా నీటి తొట్టిలు..
గతంలో ఆయా గ్రామాల్లో ఉపాధి పథకంలో భాగంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి నీటి తొట్లు నిర్మించారు. కానీ వాటి నిర్వహణను ఎవరూ పట్టించుకోకపో వడంతో నిరుపయోగంగా మారాయి. అధికారు లు నీటి తొట్లలో నీరు నింపేలా చర్యలు తీసు కోవాలని వినియోగం లోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -