Thursday, April 9, 2026
E-PAPER
Homeబీజినెస్వేస్ట్-టు-ఎనర్జీ రంగంలోకి తొలి జపనీస్ ఎఫ్‌డీఐ (FDI)

వేస్ట్-టు-ఎనర్జీ రంగంలోకి తొలి జపనీస్ ఎఫ్‌డీఐ (FDI)

- Advertisement -

ఆంటోనీ వేస్ట్‌లో 750 మిలియన్ యెన్‌ల పెట్టుబడి పెట్టిన జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్ (JFE Engineering)

జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్ భారతదేశంలో పెడుతున్న ఈ తొలి పెట్టుబడి.. దేశంలోని వేస్ట్-టు-ఎనర్జీ (వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి) అవకాశాలపై , ఆంటోనీ వేస్ట్ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న అంతర్జాతీయ విశ్వాసానికి సంకేతం.

• ఈ డైరెక్ట్ ఈక్విటీ భాగస్వామ్యం సంస్థల సుదీర్ఘ వ్యూహాత్మక నిబద్ధతను సూచిస్తుంది.

• ఆంధ్రప్రదేశ్‌లో ఆంటోనీ వేస్ట్ ఏర్పాటు చేయనున్న వేస్ట్-టు-ఎనర్జీ ఎస్పీవీ (SPV) లలో 25% వాటా కోసం సుమారు 750 మిలియన్ యెన్‌ల (¥750 million) పెట్టుబడి పెట్టనున్న జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్.

• ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను నిర్మించిన అనుభవంతో ఈపీసీ (EPC) పనులను ముందుండి నడిపించనున్న జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్ ఇండియా.

• భారతదేశపు వేస్ట్-టు-ఎనర్జీ రంగంలోకి వచ్చిన తొలి జపనీస్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) ఇదే.

• భారతదేశం ఏటా 62 మిలియన్ టన్నులకు పైగా మున్సిపల్ ఘన వ్యర్థాలను (MSW) ఉత్పత్తి చేస్తోంది. దేశంలో వేస్ట్-టు-ఎనర్జీ పరిష్కారాల అవసరం ఎంత ఉందో ఇది స్పష్టం చేస్తోంది.

ప్రాజెక్ట్ వివరాలు:

ఈ భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో (కడప , కర్నూలు) రెండు వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల అభివృద్ధి ఉంటుంది:

• సామర్థ్యం: ఒక్కో ప్లాంట్‌కు రోజుకు దాదాపు 1,000 టన్నుల మున్సిపల్ వ్యర్థాల (MSW) ఇన్‌ఫ్లో.

• WtE ప్లాంట్ సామర్థ్యం: ఒక్కో ప్లాంట్‌కు రోజుకు 750 టన్నులు.

• విద్యుత్ ఉత్పత్తి: ఒక్కో ప్లాంట్‌కు ~15 MW (రెండూ కలిపి ~30 MW).

• కాంట్రాక్ట్ కాలపరిమితి: 20 సంవత్సరాలు.

• PPA టారిఫ్: యూనిట్‌కు ₹8.10.

• మొత్తం ప్రాజెక్ట్ ఆదాయం అంచనా: దాదాపు ₹3,200 కోట్లు.

• ఫైనాన్సింగ్: 75% అప్పు (Debt) / 25% ఈక్విటీ.

• నిర్మాణ పనులు 24 నెలల్లో పూర్తవుతాయని భావిస్తున్నారు. FY2028-29 మొదటి త్రైమాసికంలో ప్లాంట్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇండస్ట్రీ నేపథ్యం & అవకాశాలు:

• పర్యావరణహితంగా వ్యర్థాలను తొలగించేందుకు “వేస్ట్-టు-ఎనర్జీ (చెత్త నుంచి కరెంటు)” పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ప్రధాన పరిష్కారంగా మారుతోంది.

• బలమైన ప్రభుత్వ పాలసీ మద్దతు , పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్స్ వాడకం పెరుగుతోంది.

• భారతదేశ వేస్ట్-టు-ఎనర్జీ సామర్థ్య అంచనా: 2031 నాటికి 1,075 MW, 2050 నాటికి 2,780 MW.

• భారతదేశం ఏటా 62 మిలియన్ టన్నులకు పైగా మున్సిపల్ ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది, ఇది ఏడాదికి ~1.33% చొప్పున పెరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -