Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దఎడ్గిలో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమం

పెద్దఎడ్గిలో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలో ప్రజా ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా  పెద్ద ఏడ్గి గ్రామంలో రెండవ దశలో అసంవ్యాధి వ్యాధుల ఎన్సీడీ (NCD) స్క్రీనింగ్ కార్యక్రమం గురువారం విజయవంతంగా నిర్వహించబడింది గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తపోటు (హైపర్‌టెన్షన్) మరియు మధుమేహం (డయాబెటిస్) నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. అదేవిధంగా, హెచ్ఐవి (HIV) అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి, దాని ధృవీకరణ చేపట్టారు.

గ్రామ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, వ్యాధుల నివారణకు అవసరమైన సూచనలు మరియు సలహాలు వైద్య బృందం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అస్పత్వర్ అనిల్ కుమార్ ,  ఏఎన్ఎం (ANM) సావిత్రి , కార్యదర్శి రమేష్ , వార్డ్ మెంబెర్ ఆనంద్ , గ్రామ ఆశ వర్కర్లు మరియు గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు సహకారం అందించారు అని గ్రామ సర్పంచ్  పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -