నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నూతన ఎస్సైగా మురళి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఎస్ఐ మురళి గతంలో బాన్సువాడ టౌన్ ఎస్సైగా విధులు నిర్వహించారు. జుక్కల్ ఎస్సై నవీన్ చంద్రను బాన్సువాడ టూ టౌన్ ఎస్ఐగా జిల్లా ఎస్పీ రాజేష్ ఆదేశాలనుసారం బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మురళి మాట్లాడుతూ.. మండల పరిధిలో శాంతి భద్రతలు కాపాడుతానని, పేకాట, మట్కా, అక్రమ ఇసుక రవాణా, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన చట్టాలను గౌరవించి నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజా సమస్యలను నిత్యం పరిష్కరించేందుకే పోలీసులు ఉన్నారని అన్నారు. ప్రజల భద్రత కాపాడాలని ఉద్యోగ రిత్యా సేవ చేయడానికి వచ్చామని, అందుకు మండలంలోని ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
జుక్కల్ ఎస్సై గా మురళి భాద్యతలు స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



