Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఆలేరు సర్పంచ్ జన్మదిన వేడుకలు 

ఘనంగా ఆలేరు సర్పంచ్ జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ- నెల్లికుదురు
గ్రామ అభివృద్ధి, కార్యకర్తలేనా బలమని, ఆలేరు గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరుస్తున్న సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఆ గ్రామ ఉపసర్పంచ్ తెలిపారు. ఈ క్రమంలో గురువారం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకొని పేదలకు పండ్లను పంచారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ గా నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి అయిన తర్వాతనే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని సమస్య లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నరని అన్నారు. వార్డు సభ్యులు నరేష్, అక్తర్, భాగ్యలక్ష్మి,సుగుణమ్మ, వెంకటమల్లు, మల్లేష్, కాంగ్రెస్ సీనియర్లు అజీమ్, సుమన్, బిక్షపతి, యుగేందర్,సుధాకర్,సూరయ్య, రాజన్న, రమేష్, జనార్దన్, యాకన్న శ్రవణ్,మరియు మహిళామణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -