Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో అమానుషం

దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో అమానుషం

- Advertisement -

మహిళా ప్రాంగణ విద్యార్థినీలు దుస్తులు మార్చుకుంటున్న ఫోటోలు వైరల్
నవతెలంగాణ- ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో గురువారం తీవ్ర వివాదం చోటుచేసుకుంది. స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 2 తేదీ నుండి 31 వరకు బ్యూటీషియన్ కోర్సు నేర్పేందుకు ట్రైనర్ గా  స్నేహ వచ్చారని, విద్యార్థినులు దుస్తులు మార్చుకొనుచుండగా ఫోటోలు తీసి ఆమెకు తెలిసిన జిల్లా కేంద్రానికి చెందిన సతీష్ అనే వ్యక్తికి షేర్ చేశారని తెలిపారు. అతను గ్రూప్లో ఉన్న కొందరు విద్యార్థినిలకు అసభ్యంగా ప్రవర్తించే విధంగా వాట్సాప్ చాటింగ్ చేసినట్టు తెలిపారు. 28 మంది విద్యార్థినీలు ఈ బ్యూటిషన్ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారని అన్నారు. ట్రైనర్ స్నేహను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, షీ టీం బృందం సైతం విచారణ చేపట్టారు.

విద్యార్థి సంఘాల ఆందోళన..
మహిళ ప్రాంగణానికి నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థుల పట్ల ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటని, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిద్ధల నాగరాజులు ప్రాంగణం ఆవరణ యందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందుకు బాధ్యత వహిస్తూ ప్రాంగణం అధికారిని ఇందిరపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ విషయమై జిల్లా సిపికి సైతం ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వీరితోపాటు నాయకులు దుర్గాప్రసాద్, నిఖిల్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -