నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రోడ్డు భద్రత కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలపై సిఎస్, డిజిపి లు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్ భద్రత ప్రతిజ్ఞ, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
పోలీస్ శాఖ తరపున అర్రైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టును పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



