టెస్టుల్లో తొలి విజయం సాధించిన జట్టు సభ్యుడు
చెన్నై : తొలి తరం భారత క్రికెటర్, టీమ్ ఇండియా తొలి టెస్టు విజయం సాధించిన జట్టులో సభ్యుడు సిడి గోపీనాథ్ (96) గురువారం కన్నుమూశారు. 1930 మార్చి 1న తమిళనాడులో జన్మించిన సిడి గోపీనాథ్ భారత్‌కు ఎనిమిది టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. మద్రాస్‌కు 83 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడాడు. 1951లో బ్రబౌర్న్ స్టేడియంలో ఇంగ్లాండ్‌పై టెస్టు క్రికెట్ అరంగ్రేటం చేసిన గోపీనాథ్.. 1960లో ఆస్ట్రేలియాపై ఈడెన్‌గార్డెన్స్‌లో ఆఖరు టెస్టు ఆడాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన గోపీనాథ్ అరంగ్రేటంలోనే అజేయ అర్థ సెంచరీ (50) సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులతో మెరువగా.. ఇంగ్లాండ్‌తో టెస్టును భారత్ డ్రా చేసుకుంది. గోపీనాథ్ కెరీర్లో ఐదో టెస్టు భారత క్రికెట్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 1952 చెన్నై టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ ఇన్నింగ్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఒక్క ఇన్నింగ్స్‌లోనే బ్యాటింగ్ చేసిన గోపీనాథ్ 35 పరుగులు చేశాడు. గోపీనాథ్ టెస్టుల్లో 12 ఇన్నింగ్స్‌ల్లో 242 పరుగులు చేయగా, ఫస్ల్క్లాస్లో 42.16 సగటుతో 4259 పరుగులు చేశాడు.
తొలి తరం క్రికెటర్ గోపీనాథ్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -



