Friday, April 10, 2026
E-PAPER
Homeఆటలుఆసియాలో పసిడి పంచ్‌

ఆసియాలో పసిడి పంచ్‌

- Advertisement -

మీనాక్షి, ప్రీతి, ప్రియ, అరుంథతిలకు స్వర్ణాలు
ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ 2026

ఉలాన్బాతర్‌ (మంగోలియా) : ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు చారిత్రక ప్రదర్శన కనబరిచారు. నాలుగు స్వర్ణాలు, రెండు సిల్వర్‌ మెడల్స్‌ సహా 10 పతకాలు సాధించిన భారత్‌.. పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చీఫ్‌ కోచ్‌ శాంటియాగో నీవ సారథ్యంలో రింగ్‌లోకి అడుగుపెట్టిన ప్రతి భారత మహిళా బాక్సర్‌ మెడల్‌ సాధించటం విశేషం. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో మీనాక్షి 5-0తో మంగోలియా బాక్సర్‌ నొముందరిపై అదిరే విజయం సాధించింది. 54 కేజీల విభాగంలో ప్రీతి కండ్లుచెదిరే ప్రదర్శన చేసింది. చైనీస్‌ తైపీ బాక్సర్‌, మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌ హుయాంగ్‌ను 5-0తో చిత్తు చేసింది. ఈ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకుంది. 60 కేజీల విభాగం పసిడి పోరులో ప్రియ 3-0తో ఉత్తర కొరియా బాక్సర్‌ ఉన్‌ యాంగ్‌పై గెలుపొందింది. 70 కేజీల విభాగం ఫైనల్లో అరుంధతి 4-1తో కజకిస్తాన్‌ బాక్సర్‌పై గెలుపొంది పసిడి పతకం దక్కించుకుంది. మహిళల 51 కేజీల విభాగంలో తెలంగాణ స్టార్‌ నిఖత్‌ జరీన్‌ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ కనీసం 16 పతకాలు ఖాయం చేసుకోగా.. పురుషుల విభాగంలో రెండు ఫైనల్స్‌ జరగాల్సి ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -