హైదరాబాద్ : లెవల్ వైజ్ బార్సు అండ్ గర్ల్స్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో తెలంగాణ జట్టు 27 పతకాలతో సత్తా చాటింది. టేబుల్ వాల్ట్, అన్‌ఈవెన్ బార్స్, బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ వంటి విభాగాల్లో తెలంగాణ జిమ్నాస్ట్‌లు 25 రజత, 2 కాంస్య పతకాలు సాధించారు. పతకాల పంట పండించిన తెలంగాణ జాతీయ స్థాయిలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచింది. హియా యాదవ్, అంశుల్ యాదవ్, మాన్వి రెడ్డి, లౌక్క విరాట్, ఇనార రుక్విణి, సిమోన్ పెస్టోంజి, ఖుషి రారుతో పాటు ఇతర జిమ్నాస్టిలు పలు లెవల్స్‌లో రాణించారు. కల్పతరు బై వందన బద్రుక ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతర్జాతీయ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి, జాతీయ న్యాయ నిర్ణేత ఎ. ప్రియాంక పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు.



