Friday, April 10, 2026
E-PAPER
Homeఆటలుక్వార్టర్స్‌కు ఆయుష్‌

క్వార్టర్స్‌కు ఆయుష్‌

- Advertisement -

సింధు, ప్రణరు పరాజయం
ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌
నింగ్బో (చైనా) :
భారత యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి వరుస గేముల్లో గెలుపొంది ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. అగ్రశ్రేణి షట్లర్లు పి.వి సింధు, హెచ్‌.ఎస్‌ ప్రణరు పరాజయాలు చవిచూసి టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించారు. చైనాలోని నింగ్బోలో జరుగుతున్న టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో ఆయుష్‌ శెట్టి 21-16, 21-12తో చైనీస్‌ తైపీ షట్లర్‌ చి యు జెన్‌పై గెలుపొందాడు. తొలి రౌండ్లో వరల్డ్‌ నం.7 లి షి ఫెంగ్‌ (చైనా)పై ఆయుష్‌ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్వార్టర్‌ఫైనల్లో 2024 చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీతో ఆయుష్‌ పోటీపడనున్నాడు. రెండు సార్లు ఒలింపిక్స్‌ మెడలిస్ట్‌, అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు మహిళల సింగిల్స్‌లో 18-21, 8-21తో చైనా షట్లర్‌ వాంగ్‌ జి యి చేతిలో చిత్తుగా ఓడింది. ఉన్నతి హుడా 17-21, 9-21తో జపాన్‌ షట్లర్‌ మియజాకి చేతిలో ఓడగా.. ఈ విభాగంలో భారత పోరాటానికి తెరపడింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణరు 12-21, 19-21తో చైనా షట్లర్‌ వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ చేతిలో వరుస గేముల్లో ఓటమి చెందాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్టో వరుస గేముల్లో 13-21, 14-21తో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -