Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రొఫెసర్‌, విద్యార్థిపై వేధింపులు మానుకోవాలి

ప్రొఫెసర్‌, విద్యార్థిపై వేధింపులు మానుకోవాలి

- Advertisement -

విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

శాతవాహన విశ్వవిద్యాలయంలో దళిత ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, దళిత విద్యార్థి కరికే మహేశ్‌లను అర్బన్‌ నక్సలైట్ల పేరుతో వేధింపులకు గురిచేయడాన్ని మానుకోవాలని విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె చక్రధర్‌రావు, జి హరగోపాల్‌, కార్యనిర్వాహక కార్యదర్శి కె లక్ష్మినారాయణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుజాత, మహేశ్‌ను ఏ ఆధారాలు లేకుండా మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనీ, అర్బన్‌ నక్సలైట్లని కొందరు విద్యార్థులు కలెక్టర్‌, ఎంపీలకు ఫిర్యాదు చేశారని తెలిపారు. వివిధ మాధ్యమాల్లో వారిపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని అర్హతలు, అనుభవం ఉన్నా డీన్‌గా, ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఆమెను తొలగించడం కక్షపూరిత చర్య అని తెలిపారు. ఈ పరిణామాల వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి దళిత, ఆఇవాసీ కుటుంబాల నుంచి చదువుకుంటున్న ఈ వర్సిటీలో విద్యా వాతావరణం కలుషితమైందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి దెబ్బతింటున్నదని తెలిపారు. వర్సిటీల స్వయంప్రతిపత్తిని, విద్యా విషయక స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన వీసీ మౌనంగా ఉండడం సరైంది కాదని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు, వేధింపులు, కక్షపూరిత చర్యలను మానుకుని వర్సిటీ స్వయంప్రతిపత్తిని, విద్యా వాతావరణాన్ని కాపాడాలనీ వీసీ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -