13న రాష్ట్ర వ్యాప్త నిరసనలు
అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్వాడి టీచర్ వసంత కుమారిని చెట్టుకు కట్టేసి కొట్టి అనేక రకాలుగా హింసించిన దుండగులను తక్షణమే శిక్షించాలి అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. సునీత, పి జయలక్ష్మి, కోశాధికారి పి మంగ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం పద్మశ్రీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ఘటనకు నిరసనగా 13న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్టు కాంగ్టి మండలం రాసోల్ గ్రామంలో పనిచేస్తున్న అంగన్వాడి టీచర్ వసంత కుమారీని ఆ గ్రామంలోని ఇద్దరు మహిళలు ముగ్గురు పురుషులు మొత్తం ఐదు మంది కలిసి చెట్టుకు కట్టేసి కొట్టడంతో పాటు గుండు గీయిస్తామని గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతామని పలు రకాలుగా హింసించారని తెలిపారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన దుండగులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
అంగన్‌వాడీ టీచర్‌ను హింసించిన దుండగులను శిక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



