Friday, April 10, 2026
E-PAPER
Homeజాతీయంఎందుకీ తొందరపాటు చర్య

ఎందుకీ తొందరపాటు చర్య

- Advertisement -

తమిళనాడు సీఎం స్టాలిన్‌
చెన్నై : లోక్‌సభలో సీట్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ గురువారం తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని అధికార పునర్వ్యవస్థీకరణగా ఆయన అభివర్ణించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నారీశక్తి వందన్‌ అధినియం ద్వారా పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలైతే ఉత్తరాది రాష్ట్రాల సీట్లు దాదాపు రెట్టింపు అవుతాయి. లోక్‌సభలో దక్షిణ రాష్ట్రాల వాటా సుమారు 24 శాతంగా ఉంటుంది అని స్టాలిన్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌కు డిఎంకె వ్యతిరేకం కాదు. అయితే సభలో సీట్లను పెంచకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇది సంస్కరణ కాదు. అధికారాన్ని పునర్నిర్మించడం అని స్టాలిన్‌ ఎక్స్‌ పోస్టులో ఆరో పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం పార్లమెంటు పునాదులను క్రమపద్ధతిలో దెబ్బతీస్తోంది. చర్చలకు, జవాబుదారీతనానికి చైతన్యవంతమైన వేదికగా ఉండాల్సిన పార్లమెంటు.. వాటికి దూరంగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -