నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎమ్హెచ్ఎస్ఆర్బీ) 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి సెలక్షన్ లిస్టును బోర్డు వెబ్సైట్లో (https://mhsrb. telangana.gov.in/Home) అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. పారదర్శకత కోసం పరీక్ష రాసిన సుమారు 42 వేల మంది అభ్యర్థుల పూర్తి వివరాలను పొందుపర్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2024లో 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన విషయంలో తెలిసిందే. తాజా పోస్టుల భర్తీతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సుల కొరత పూర్తిగా తీరిపోయినట్టేనని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వైద్యారోగ్య శాఖలో మరో 4500 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మంత్రి దామోదర్ రాజనర్సింహ నిరంత పర్యవేక్షణ, కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టితో ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీలో వేగం పుంజుకున్నది.
2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



