Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీపై విచారణ జరిపించాలి : టీడీఎఫ్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీపై విచారణ జరిపించాలి : టీడీఎఫ్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నిర్వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తెలంగాణ డాక్టర్ల సమాఖ్య(టీడీఎఫ్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియామక ప్రక్రియపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు టీడీఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ కె.ఇన్వెస్ట్‌, అధ్యక్షులు డాక్టర్‌ పీఎస్‌.విజయేందర్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఏఎఫ్‌ఎమ్‌డీ. నిదావుల్లా, కన్వీనర్‌ డాక్టర్‌ కె.సత్యప్రకాశ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

‘మార్కుల కేటాయింపుల్లో వ్యత్యాసాలుండటం, నియామక ప్రక్రియ యోగ్యత ఆధారంగా జరుగలేదనే ప్రచారం, పోస్టు కోసం రూ.12 లక్షల నుంచి 20 లక్షల వరకు డిమాండ్‌ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి’ అని ఎత్తి చూపారు. వివిధ స్పెషాలిటీలలోని సుమారు 174 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వైద్యవిద్యలో పోస్టులు ప్రక్రియ సరిగా జరుగకపోతే ఆరోగ్య సంరక్షణపైనా, వైద్యవిద్యపైనా నేరుగా ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మూల్యాంకనం, ఎంపిక ప్రమాణాల్లో పూర్తి పారదర్శకతను నిర్ధారించాలని కోరారు. పోస్టులను అమ్ముకున్నట్టు తేలితే దాని ఎంతటి వ్యక్తులున్నా, సంస్థలున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -