Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ ఉద్యోగుల సహజ మరణానికి రూ.10 లక్షల బీమా

ఆర్టీసీ ఉద్యోగుల సహజ మరణానికి రూ.10 లక్షల బీమా

- Advertisement -

ఎస్‌డబ్ల్యూఎఫ్‌ హర్షం
నవతెలంగాణ-హైదరాబాద్‌

టీజీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగుల సహజ మరణానికీ యూనియన్‌ బ్యాంక్‌ ద్వారా రూ. 10 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించటాన్ని టీజీఎస్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, విఎస్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. యూనియన్‌ బ్యాంక్‌లో సూపర్‌ సాలరీ అకౌంట్‌ ఉన్న సిబ్బందికి ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణిస్తేనే రూ 1.15 కోట్లు ప్రమాదబీమా వర్తిస్తున్నదని చెప్పారు. 2024లోనే ఉద్యోగుల సహజ మరణానికి కూడా రూ.15 లక్షలు బీమా సౌకర్యము కల్పించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసిందన్నారు. ఇటీవల యూనియన్‌ బ్యాంకులో వేతన ఖాతా ఉన్న సింగరేణి సంస్థ ఉద్యోగుల సహజ మరణానికి రూ 10 లక్షల బీమా సౌకర్యం కల్పించిన దానికి అనుగుణంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా బీమా సౌకర్యం కల్పించాలని టిఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ వినతి పత్రం సమర్పించినట్టు తెలియజేశారు. ఈ బీమా సౌకర్యం ఈనెల ఒకటి నుంచే అమల్లోకి వచ్చినట్టుగా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -