- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ప్రతి గ్రామంలో సప్త కార్యక్రమం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం 7 రోజుల పాటు జరుగుతుందని వారు తెలిపారు. ప్రతి రోజు భక్తులు భాజా భజంత్రీలు, కీర్తనలు చేస్తారని అన్నారు. ప్రజలు భారీ ఎత్తున ఈ ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. చెడు మార్గాన్ని వీడి సన్మారంలో నడిపించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. ఈ క్రమంలో పెద్ద ఎడ్గి సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ సప్త కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సర్పంచ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -



