- Advertisement -
బ్రసిలియా : చిన్నారులు, కౌమార దశలో ఉన్న వారి వ్యక్తిగత డేటాను అక్రమంగా నిర్వహించినందుకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్‌కు బ్రెజిల్ సుమారు 30 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. చట్టపరమైన ప్రాతిపదిక లేకుండా, సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా యువ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ప్రాసెస్ చేయడం ద్వారా డేటా గోప్యతా చట్టాలను టిక్‌టాక్ ఉల్లంఘించిందని బ్రెజిల్ డేటా నియంత్రణ సంస్థ తన రూలింగ్‌లో తెలిపింది. కనీసం 80 లక్షల మంది చిన్నారుల డేటాను టిక్‌టాక్ ప్రాసెస్ చేసి ఉండవచ్చునని అభిప్రాయపడింది. అక్రమంగా సేకరించిన డేటాను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. కాగా ఈ రూలింగ్‌పై కంపెనీ పది రోజులలో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.
- Advertisement -



