Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు: జడ్పి సీఈఓ చందర్

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు: జడ్పి సీఈఓ చందర్

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ చందర్ నాయక్ తెలిపారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండలం లోని బొప్పాస్ పల్లి గ్రామంలో  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను పరిశీలించారు. బొప్పాస్ పల్లి గ్రామంలో మొదటి విడతగా 11 ఇండ్లు మంజూరు కాగా, రెండవ విడతలు 28 ఇండ్లు మంజూరయ్యాయి. అలాగే మూడవ విడతలో మరో 25 మందికి రెండు మంజూరు కావడంతో నేడు పలు లబ్ధిదారుల ఇండ్లకు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా జెడ్పి సీఈవో మాట్లాడుతూ మాట్లాడుతూ  ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చేసిన  లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామానికి కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జాప్యం పై వివరణ, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ సొంతింటిని నిర్మించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు.ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు.

పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా అర్హులకే వీటిని కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఐదు లక్షల్లోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకోవాలన్నారు. ఆర్భాటాలకు వెళ్లి అప్పుల పాలు కాకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవి ఈశ్వర్ గౌడ్ , హౌసింగ్ ఏఈ  సమీనా, గ్రామ సర్పంచ్ లక్ష్మి బలరాం సింగ్, గ్రామ కార్యదర్శి సుధాకర్, ఉపాధి హామీ అధికారులు 
లావణ్య, సాయిలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -