- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన పోలోజు మొగిలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి, తెలంగాణ ఉద్యమకారుడు పోలోజు సత్యనారాయణ మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని సర్పంచ్ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,పలువురు పాల్గొన్నారు.
- Advertisement -



