Saturday, April 11, 2026
E-PAPER
Homeమానవిమండే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు…

మండే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు…

- Advertisement -

మండే ఎండలో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడమంటే ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే. రోజు వారీ కూలీలు, ఉద్యోగస్థులు వేసవిలో ఎంత కష్టమైనా బయటికి వెళ్లాల్సిందే. కానీ ఎండలో బయటికి వెళ్లాక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మండుతున్న ఎండలో వడదెబ్బ సమస్య ఎక్కువగా ఉంటుంది. నిరంతరం చెమటలు బాగా పడతాయి. వేసవిలో వేయించిన ఆహారాలు, కారంతో కూడిన ఆహారాన్ని తింటే అజీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి ఆహారాలు తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఎండలో బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా తమతోపాటు ఒక నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లాలి. బస్సులో ఉన్నా, కాలినడకన వెళ్తున్నా తప్పకుండా నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లాలి. దాహంగా లేకున్నా అప్పుడప్పుడు నీరు తాగాలి. అలాగే పెరుగు, తాజా పండ్ల రసం వంటి శీతల పానీయాలు కూడా ఈ సీజన్‌లో చాలా ఆరోగ్యకరమైనవి. ముదురు రంగు దుస్తులను వేసుకోవడం మానుకోవాలి. లేత రంగు దుస్తులు ధరించాలి. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం మంచిది. అలాగే, ఎండ నుంచి ముఖాన్ని రక్షించుకోవడానికి టోపీలు, సన్‌ గ్లాసెస్‌, గొడుగులను ఉపయోగించవచ్చు. ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి కాటన్‌ స్కార్ఫ్‌తో తల, ముఖాన్ని కవర్‌ చేసుకోవాలి.

వేసవిలో టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఇందులోని కెఫిన్‌ శరీరాన్ని డీహైడ్రేట్‌ చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతనూ పెంచుతుంది. శీతల పానీయాలకు కూడా దూరంగా ఉండాలి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సీజనల్‌ ఫ్రూట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో బయట దొరికే నూనె-మసాలా ఆహారాన్ని తీసుకోవడం నివారించాలి. ఇంట్లో వండిన భోజనం తినాలి. తేలికపాటి భోజనం తినడం ఇంకా మంచిది. ఈ వేసవిలో ప్రొటీన్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినకపోవడమే మంచిది. అవసరమైతే పెరుగు, పెరుగు అన్నం, పప్పు వంటి ఆహారాలు తినాలి. ఆహారంలో ఎక్కువ ద్రవం ఉండేలా చూసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -