నవతెలంగాణ హైదరాబాద్: మీరాలం చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. భారీ క్రేన్ పై నుంచి మీరాలం చెరువు పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మీరాలం నుంచి మూసీలోకి వరద వెళ్లేలా నాలాను విస్తరించాలన్నారు. వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ ఏర్పాటు చేయాలని, మీరాలం చెరువులో ఉన్న ఐ ల్యాండ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇక్కడికి పర్యాటకులను రప్పించేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.
మీరాలం చెరువు… సీఎం ఆకస్మిక తనీఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



