మంత్రి అజహరుద్దీన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మైనారిటీ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 5వేలమంది అవుట్ సో ర్సింగ్ బోధనేతర, బోధనా సిబ్బంది జీతాల్లో ఎలాంటి కోతలుం డబోవని రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాకుబ్ పాషా మైనా రిటీ విద్యా సంస్థల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలి పారు. ఆ సిబ్బంది పూర్తికాలం జీతం చెల్లించేలా అవసరమైన చర్య లు తీసుకోవాలని మంత్రి, శాఖ కార్యదర్శి షఫిఉల్లాను ఆదేశించారు. సంబంధిత శాఖలు, సంస్థలతో సమన్వయం చేసుకుని పూర్తికాలం వేతనంతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ లబ్ది పునరుద్ధరణ చేస్తూ వారి ఆర్థిక స్థిరత్వాన్ని, గౌరవాన్ని కాపా డాలని ఆదేశించారు. మైనారిటీల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపించే ఎలాంటి విధానాలను, కార్యచరణను ప్రభుత్వం అనుసరించబోదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి తక్షణ జోక్యంతో 5 వేల కుటుంబాలు ఉపశమనం కలుగనున్నది.
అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోత ఉండదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



