Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైశాఖి వేడుకలకు రండి

వైశాఖి వేడుకలకు రండి

- Advertisement -

– మంత్రి అజహరుద్దీన్‌ కు ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వైశాఖి (ఖాల్సా ఫౌండేషన్‌ డే) వేడుకలకు రావాలంటూ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్‌ అజహరుద్దీన్‌ ను సిక్కు ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఆయనను గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ నాయకులు సర్దార్‌ భాగేందర్‌ సింగ్‌, సర్దార్‌ జోగిందర్‌ సింగ్‌ ముల్తాని తదితర నాయకులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్‌ 14న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో ఉన్న గురుద్వారా సాహెబ్‌ శ్రీ గురు రామ్‌దాస్‌ జీ వద్ద వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వైశాఖిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలనీ, సిక్కు కార్పొరేషన్‌ ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. మంత్రి స్పందిస్తూ, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -