Saturday, April 11, 2026
E-PAPER
Homeజాతీయంమానవ అక్రమ రవాణా అనుమానంతో సన్యాసినుల నిర్బంధం

మానవ అక్రమ రవాణా అనుమానంతో సన్యాసినుల నిర్బంధం

- Advertisement -

ఇండోర్‌ : మానవ అక్రమ రవాణా ఆరోపణలపై మంగళవారం నాడు ఇండోర్‌ రైల్వే పోలీసులు ఒక సన్యాసినుల బృందాన్ని, విద్యార్థినులను కొద్దిసేపు అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం విడుదల చేశారు. ఒక కాన్వెంట్‌లో చదువుతున్న ఇద్దరు సన్యాసినులు, పలువురు విద్యార్థినులతో కూడిన ఈ బృందం, తమ ఇండ్లకు తిరిగి ప్రయాణానికి ఒడిశా వెళ్లే రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చారు. సుమారు పది మందిని పోలీసు అధికారులు ఆపి అనుమానంతో విచారించారు. మానవ అక్రమ రవాణా అనుమానంతో పోలీసులు చర్య తీసుకున్నట్టు సమాచారం. ఫలితంగా, వారు బుక్‌ చేసుకున్న రైలు ఎక్కలేకపోయారు. చర్చి అధికారులు, స్థానిక ప్రతినిధులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ పరిస్థితి పరిష్కారమైంది, ఆ తర్వాత ఆ బృందాన్ని విడుదల చేశారు.

ఈ ఘటనపై స్పందిస్తూ, ఇది చర్చి సభ్యులపై పెరుగుతున్న నిఘా, సవాళ్లను ప్రతిబింబిస్తుందని బిషప్‌ థామస్‌ మాథ్యూ అన్నారు. ”మేం మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు, కానీ కోల్పోయిన సమయం, డబ్బు, మనశ్శాంతిని తిరిగి పొందలేం. సకాలంలో జోక్యం చేసుకోకపోయి ఉంటే, పరిస్థితి మరింత దిగజారి ఉండేది,” అని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, అక్కడ నన్స్‌ను మానవ అక్రమ రవాణా ఆరోపణలపై నిర్బంధించారని కూడా ఆ నివేదిక పేర్కొంది. ధృవీకరించని ఫిర్యాదుల ఆధారంగానే తరచుగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -