– ఫూలే, అంబేద్కర్ జయంతోత్సవాలను పురస్కరించుకుని నిర్వహణ
– నేడు బాగ్‌లింగంపల్లి ఎస్వీకే వద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం
– ముఖ్య అతిథిగా హాజరుకానున్న కాకి మాధవరావు
– సాయంత్రం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఆదర్శ దంపతులతో మానవహారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫూలే, అంబేద్కర్ జయంతోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకే)లో కులనిర్మూలన అంశంపై సాంస్కృతిక కార్యక్రమాలను ఎస్వీకే, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ‘కులాన్ని పాటించం..మనిషిని గౌరవిస్తాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాలు జరుగునున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు ఎస్వీకే వద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు ప్రారంభించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి చిక్కడపల్లి వరకు ఆదర్శ దంపతుల మానవహారం ఉంటుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎస్వీకేలో నాటక ప్రదర్శనలు, పాటలు, డ్యాన్స్ కార్యక్రమాలుంటాయి. 12న మహాత్మా జ్యోతిరావు ఫూలే నాటకం ప్రదర్శించనున్నారు. 13న కుల వ్యవస్థ నిర్మూలన పాటలతో పాటు లఘు చిత్రాల ప్రదర్శన ఉంటుంది. జానపద కళాకారులు తమ కళలను ప్రదర్శించనున్నారు. అరుణోదయ విమలక్క బృందం ప్రజాగీతాలను ఆలపించనున్నది. 14న సాయంత్రం ఆరు గంటలకు తులసీ తీర్థం నాటిక ప్రదర్శన ఉండనున్నది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. బహుమతుల ప్రదానంతో ఉత్సవాలు ముగియనున్నాయి. సాహితీవేత్తలు, కవులు, కళాకారులను ఒకతాటిపైకి తీసుకొచ్చి ‘కుల వ్యవస్థ నిర్మూలన సాంస్కృతిక ఉత్సవం’ నిర్వహించ నుండటం ఇదే తొలిసారి అని ఎస్వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్, టీపీఎస్కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు తెలిపారు.
నేటి నుంచి 14వరకు కులనిర్మూలనపై సాంస్కృతిక కార్యక్రమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



