- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మొదటి, రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను రేపు (ఆదివారం) మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటించారు. ఈ ఏడాది సుమారు 9.5 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. కాగా సీఎం రేవంత్ చేతుల మీదుగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -



