Friday, August 28, 2026
E-PAPER
Homeజాతీయంప్రమాదకరంగా హిమనదాలు

ప్రమాదకరంగా హిమనదాలు

- Advertisement -

ఏ క్షణం అయినా ఆనకట్టలు తెగే ప్రమాదం
నేపాల్ జలప్రళయానికి మించి విధ్వంసం జరిగే అవకాశం
భారత్‌కూ పొంచివున్న ముప్పు

న్యూఢిల్లీ : మొన్న నేపాల్లోని భోటే కోషె హిమనదిలో రాళ్లు, మంచుకొండలు విరిగిపడటంతో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. వందలాది మంది గల్లంతయ్యారు. ఇండ్లు, భవనాలు, బ్రిడ్జిలు, రోడ్లు అన్నీ కొట్టుకుపోయాయి. ఇంతకు మించి విధ్వంసం సృష్టించగల 88 అత్యంత ప్రమాదకర హిమనదులు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఐఐటీ రోపర్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ నిర్వహించిన పరిశోధనల్లో హిమాచల్ ప్రదేశ్లో 1990లో 107 హిమనదీ సరస్సులు ఉంటే.. 2024 వరకు 669 హిమనదీ సరస్సులు ఏర్పడ్డాయి. అంటే 25 శాతం ఈ నదులు పెరిగాయి.

హిమనదీ సరస్సు అంటే..
పర్వతాల్లో అధిక ఎత్తులో ఉన్న హిమనదులు కరిగినప్పుడు వాటి నుంచి వచ్చే నీరు సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో లేదా రాతి గోడల వెనక చేరుతుంది. క్రమంగా అక్కడ సరస్సు ఏర్పడుతుంది. దీనినే హిమ నదీ సరస్సు అంటారు. ఇలాంటి సరస్సులు హిమనదికి ముందు లేదా వెనకభాగంలో కూడా ఏర్పడవచ్చు. ఈ సరస్సులోని నీటిని మంచు, రాళ్లు, కొండచరియల మట్టితో ఏర్పడిన ఒక సహజ ఆనకట్టు అడ్డుకుంటుంది. ఏదైనా కారణాలతో ఈ సహజ ఆనకట్ట తెగిపోతే ఆ సరస్సులో ఉన్న లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలను తుడిచిపెట్టేస్తుంది. దీనినే గ్లాసిక్ లేక్ ఔట్రెజ్ బరస్ట్ అంటారు.

88 సరస్సులు అత్యంత ప్రమాదం..
ఐఐటీ రోపర్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ నివేదిక ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో 88 హిమనదీ సరస్సులు చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఇందులో 9 అత్యంత ప్రమాదకరంగా ఉండగా.. 18 అత్యధిక ప్రమాదకరంగా, 26 ప్రమాదకరంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా బియాస్లోని హిమ్సు సరస్సు, సట్లెజ్ బేసిన్ లోని పేరుపెట్టని సరస్సు ప్రమాదం గురించి వివరించాయి. హిమ్సు ఆనకట్ట తెగితే సెకనుకు 1,385 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహంతో వరదలు సృష్టించగలదు. అంటే సెకనుకు 1.4 మిలియన్ల లీటర్ల నీరు కింద ఉన్న గ్రామాలు, భవనాలు, బ్రిడ్జిలు, రోడ్లను తుడిచిపెట్టేయగలదు. సట్లెజ్ లోని సరస్సు ఆనకట్ట తెగితే సెకనుకు ఏకంగా 3,507 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహంతో 3.5 మిలియన్ లీటర్ల నీరు కిందకు దూకుతుంది. నేపాల్ వరదలను మించి విధ్వంసం సృష్టించగలదు.

నివారణకు చర్యలు తప్పనిసరి..
నేపాల్లో జరిగిన విధ్వంసం భారత్లో జరగొద్దంటే ప్రమాదకరంగా ఉన్న సరస్సులను గుర్తించాలి. వాటి ఆనకట్ట బలం, ప్రస్తుత పరిస్థితిని సెన్సార్లు, రాడార్ల సాయంతో అంచనా వేయొచ్చు. నియంత్రిత పద్ధతిలో ఆ సరస్సుల్లో ఉన్న నీటిని మెల్లిమెల్లిగా ముందే కిందకు పంపిస్తూ ఉండాలి. అప్పుడు ఒకేసారి నీరు కిందకు రాకపోవడం వల్ల ప్రమాదం ఉండదు.

అలాగే ప్రమాదకర ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను
కూడా నిలిపివేయాలి. ప్రజా భవనాల నిర్మాణాలను ఆపేయాలి. పర్యావరణ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ హిమనదీ సరస్సుల సంఖ్యను తగ్గించేందుకు ఏర్పాట్లు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -