Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామన్నగూడెం గ్రామంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు 

రామన్నగూడెం గ్రామంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు 

- Advertisement -

రామన్నగూడెం గ్రామ సర్పంచ్ బండి శ్రీనివాస్ 
నవతెలంగాణ-నెల్లికుదురు

మండలంలోని రామన్నగూడెం గ్రామంలోనీ గ్రామ పంచాయతీలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకను ఘనంగా నిర్వహించినట్టు ఆ గ్రామ సర్పంచ్ బండి శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సామాజిక అనగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని అన్నారు.19 వ శతాబ్దపు గొప్ప సామాజిక సంస్కర్త విప్లవకారుడు మరియు అనగారిన వర్గాల ఆశాజ్యోతి 19 27 ఏప్రిల్ 11 వ తారీఖున మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని జన్మించారు ఆయన తన జీవితాంతం పూణేలో నివసించి అనేక సామాజిక కార్యక్రమాలు జ్యోతిరావు పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా మహిళ విద్య కోసం అలుపెరుగని పోరాటం చేశారు. మహిళా విద్యకు నాంది భారతదేశంలో మహిళల కోసం మొట్ట మొదటి పాఠశాలను 1948 లో పూణేలో స్థాపించారు. ముందుగా తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి దేశంలోనే మొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు  . 1873లో సత్య శాదక్ సమాజ్ అనే సంస్థను స్థాపించారు. అనగా అణగారిన వర్గాలకు సమాన హక్కులు దోపిడీ దొంగల నుంచి కాపాడే విధానం ఇలాంటి అనేక కార్యక్రమాలు జ్యోతిరావు పూలే  చేసినారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్ణ వెంకన్న కార్యదర్శి హేమలత  గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -