Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సౌలతండాలో జ్యోతిరావు పూలే జయంతి

సౌలతండాలో జ్యోతిరావు పూలే జయంతి

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని సౌల తండా గ్రామపంచాయతీ ఆవరణలో గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు సుజాత వాసు నాయక తెలిపారు. శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో కుల వ్యవస్థ, అంటరానితనంపై పోరాటం చేసి, బడుగు బలహీన వర్గాల హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు . ఈ కార్యక్రమంలో నాయకులు దేవన్న లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -