Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం సేకరణకు ఏర్పాట్లు.! 

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు.! 

- Advertisement -

తాడిచెర్ల పిఏసీఎస్ సిఈఓ సంతోష్
నవతెలంగాణ – మల్హర్ రావు

యాసంగి కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 13 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నట్లుగా సిఈఓ సంతోష్ తెలిపారు. ఈ యసంగి సీజన్లో 1,25,000 క్వింటాళ్ల ధాన్యం సేకరణయే లక్ష్యంగా పెట్టుకొని కనీసం 1,15.000 క్వింటాళ్ళ ధాన్యాన్ని సేకరిస్తామని సిఈఓ పేర్కొన్నారు.మండుతున్న ఎండలను, అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లో పలు మౌలికసదుపాయాలను,రైతులకు ఏ చిన్న సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామన్నారు.యాసంగి సీజన్లో మండలంలో 8,200 వేల ఎకరాల్లో వరిపంట సాగు చేశారు.

నాణ్యతను బట్టి ధర..
ధాన్యం కొనుగోలులో నాణ్యత నిర్ధారణ పక్కగా నిర్ణయిస్తారు. తేమ 17 శాతం లోపు ఉండాలి, తాలు మూడుశాతం, మట్టి పెల్లలు ఒక శాతం, ఇతర రకాల గింజలు ఆరు శాతం, డ్యామేజీ ఐదు శాతం మించకూడదు.అంతకు మించిన ధాన్యానికి ఆశించిన ధర దక్కదు. సాధ్యమైనంత వరకు రైతులే తమ ధాన్యాన్ని గ్రేడింగ్ చేసుకోవాలి.కొనుగోలు కేంద్రాలకు వచ్చే ముందు తాలు,రాళ్లు, మట్టి వంటివి లేకుండా చూసుకోవాలి. అప్పుడే వారికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లభిస్తుంది.

మౌలిక సదుపాయాలు తప్పనిసరి..
కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం తాగునీరు,ఎండ నుంచి ఉపశమనం కోసం టెంట్లు, ధాన్యం క్వింటాల్ ధరలతో పాటు కంట్రో ల్రూం నంబర్ తో ఒక బ్యానర్ను ఏర్పాటు చేయాలి. ధాన్యం నాణ్యత పరిశీలన, కొనుగోలు,రికార్డుల నమోదు అంశంపై ఇప్పటికే నిర్వాహకులకు శిక్షణ పూర్తి చేశారు.అకాలవర్షానికి ధాన్యం తడిసిపో కుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్లు ఏర్పాటు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -