- Advertisement -
ఎడ్లపల్లి అదర్శ పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామపరిధిలోని జంగిడిపల్లిలో ఉన్న తెలంగాణ అదర్శ పాఠశాలలో ప్రవేశాలకు పరీక్షను ఈనెల 19న నిర్వహిస్తున్నట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 6వ తరగతిలో ప్రవేశాలకు ఉదయం 10 నుంచి 12 వరకు,7 నుంచి 10 తరగతి వరకు ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుందని తెలిపారు. హాల్ టికెట్లను telanganams.cgg.gov.in లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు పరీక్ష ప్యాడ్, హాల్ టికెట్, పెన్సిల్, పెన్, వాటర్ బాటిల్ మినహా ఏవీ పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దన్నారు.
- Advertisement -



