Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల ఉపాధి అభివృద్ధికి అక్షయ సంస్థ ముందడుగు

మహిళల ఉపాధి అభివృద్ధికి అక్షయ సంస్థ ముందడుగు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో మహిళల ఉపాధి అభివృద్ధి దిశగా అక్షయ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తూ మరికొందరికీ జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆ సంస్థ డైరెక్టర్ పి.రజిత రెడ్డి ఆకాంక్షించారు. శనివారం గ్రామంలో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు గ్రామ సర్పంచ్ కంతి మధు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ  గ్రామంలోని పలువురు మహిళలకు కుట్టు మెషీన్, మగ్గం వర్క్ వంటి నైపుణ్య శిక్షణలు అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలకు మండలి సమాఖ్య ఆధ్వర్యంలో వ్యక్తిగత రుణాలు కూడా అందజేస్తూ, వారి స్వయం ఉపాధి అభివృద్ధికి సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వి.ఓ.ఏలు సాఫియా, అధ్యక్షురాలు పద్మ, ఉమ మహేశ్వరి, ఆకాంక్ష, శ్రీలత, వనిత తదితర మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -