Saturday, April 11, 2026
E-PAPER
Homeకరీంనగర్మాకు ఆ పాఠశాల వద్దు బాబోయ్..

మాకు ఆ పాఠశాల వద్దు బాబోయ్..

- Advertisement -

వెంటనే ఇతర పాఠశాలకు డిప్యూటేషన్ ఇవ్వండి
– ప్రధానోపాధ్యాయుడిపై ఆరోపణలు..ఉపాధ్యాయుల్లో ఆందోళన
– డిప్యూటేషన్ కోరిన మైతాపూర్ పాఠశాల టీచర్లు
నవతెలంగాణ – రాయికల్

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించడం ఇబ్బందికరంగా మారిందని, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ప్రధానోపాధ్యాయుడిపై ఆరోపణలు రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

ముఖ్యంగా విద్యార్థులు కూర్చోవడానికి డెస్కులను అల్లీపూర్ పాఠశాల నుంచి తెప్పించడం, శుద్ధి నీటి కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, దాతల సహకారంతో విద్యార్థులందరికీ ఉచిత క్రీడా దుస్తులు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఇలా పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానోపాధ్యాయుడిపై ఆరోపణలు రావడం తమను కలవరపెడుతోందని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం కష్టంగా మారిందని, భవిష్యత్తులో తమకూ ఇలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున తమను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై నియమించాలని సంబంధిత అధికారులకు ఉపాధ్యాయులు వినతిపత్రం అందించారు. అధికారులకు అందించిన లేక ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -