Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్త్రాగునీటిని వృధా చేయొద్దు

త్రాగునీటిని వృధా చేయొద్దు

- Advertisement -

– ఇంట్రా ఆర్డబ్ల్యూఎస్ డిఈ వెంకటేశ్వర్ గౌడ్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ప్రజలు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి అందించే స్వచ్ఛమైన త్రాగునీటిని వృధా చేయొద్దని ఇంట్రా ఆర్డబ్ల్యూఎస్ డిఈ వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని నాగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డి వెంకటేశ్వర్ గౌడు మాట్లాడుతూ గ్రామంలో శాతం మిషన్ భగీరథ త్రాగునీటి కనెక్షన్లు ఉన్నాయన్నారు. ఈ నల్లాల ద్వారా ప్రతిరోజు నీటిని అందిస్తున్నామన్నారు.

ఈ శుద్ధమైన త్రాగునీటిని ప్రజలు వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు నీటి నాణ్యత పరీక్షలను నిర్వహించారు. బోరు నీటికి, మిషన్ భగీరథ నీటికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. కార్యక్రమంలో ఇంట్రా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అమీర్ ఖాన్, గ్రిడ్ ఏఈ ఉదయ్, ఉప సర్పంచ్ ఉల్లెంగుల శశిధర్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, బొడ్డు శివానంద్, పాలెపు రాజేశ్వర్, పార్వతి రాజేందర్, మామిడి ఆమని, గడ్డం పద్మ, పార్వతి భూలక్ష్మి, శానిటేషన్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -