Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ రాజేశ్వరి నగర్ లో చలివేంద్రం ప్రారంభం

రాజ రాజేశ్వరి నగర్ లో చలివేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని రాజరాజేశ్వరి నగర్ లో శనివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటుచేసిన ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ తైద సుశీల సాయన్న  ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుశీల సాయన్న మాట్లాడుతూ వేసవి ఎండల నేపథ్యంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎండ వేడిమికి దాహంతో వచ్చే ప్రయాణికులకు, గ్రామస్తులకు చల్లటి త్రాగు నీటిని ప్రతిరోజు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. గ్రామం గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులు, గ్రామస్తులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధ్యాగ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -