Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాజిక విద్య విప్లవకారుడు మహత్మ జ్యోతిభా ఫూలే

సామాజిక విద్య విప్లవకారుడు మహత్మ జ్యోతిభా ఫూలే

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
భారతదేశ సామాజిక విద్య విప్లవకారుడు మహత్మ జ్యోతిభా ఫూలే అని గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ కొనియాడారు. శనివారం మండలంలోని ఉప్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సామాజిక విద్య విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా బాలికల విద్యకై పాఠశాలను ప్రారంభంచిన వారికి అక్షరాలు నెర్పిన జ్ఞానయోధుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ  కార్యదర్శి రాఘవేందర్, అంబెడ్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు, న్యాయవాది సుంకరి విజయ్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు జెల్లా సదానంద్, వార్డ్ సభ్యులు రాకెష్, సంతోష్, సాదుల్లా, రవి, యూత్ కాంగెస్ అధ్యక్షుడు నరేందర్, మారుపాక నరేష్, ఎనేడ్ల ప్రసాద్, అరుణ్ ఆంజనేయులు, సల్మాన్, అనిల్, రాజేశ్వర్ గౌడ్, ఉబేద్, ఫారూఖ్, అశ్వపతి, అఖిలేష్, రవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -