Friday, August 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

- Advertisement -

ఈఎల్వి ఫౌండేషన్ చెర్మెన్ బాస్కర్ కు రాఖీ కడుతున్న మహిళలు
నవతెలంగాణ – చండూరు

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండల వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.మండల కేంద్రం లోని తన నివాసం వద్ద ఈఎల్వి ఫౌండేషన్ చెర్మెన్ బాస్కర్ రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన  మహిళలు బాస్కర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మహిళలకు చిరలు పంపిణీ  చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో  వివిధ ప్రాంతాల నుండి తమ  ఆడపడుచులు వచ్చి అన్నదమ్ములకు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు.అక్క చెల్లెల్లు అన్నా తమ్ముళ్లకు హారతులు ఇచ్చి నోటిని తిపి చేసి తమ ఓనత్యాన్ని  చాటుకున్నారు. సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అని అన్నారు. ఈఎల్వి ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -