హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న కొత్త సినిమా ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ భువన్, శ్రీకర్ నిర్మాణంతో ఠాగూర్ మధు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ఒక భారీ చారిత్రక యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దారు. రవి బస్రూర్ సంగీతం అందించగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘రా రా ధీవర’ ఈనెల 16న విడుదల కానుంది.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఒక పవర్ఫుల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్లో నిఖిల్ ఒక యోధుడి అవతారంలో, దట్టమైన అడవిలో నిలబడి, ఈటెను విసరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించారు.
ఈ పాట ఎంత గ్రాండ్‌గా, అద్భుతంగా, కళ్లు చెదిరేలా ఉండబోతోందో ఈ పోస్టర్ సూచిస్తుంది. ఇంతకుముందు విడుదలైన టీజర్, భారీతనం, విజువల్స్, ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరుకు అద్భుతమైన స్పందనను అందుకుని, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. పాత్రలో సహజంగా ఒదిగిపోవడానికి నిఖిల్ ఈ ప్రాజెక్ట్‌పై దాదాపు రెండు సంవత్సరాలు వెచ్చించి, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు.
నిర్మాతలు త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయబోతున్నారు. నిఖిల్, సం యుక్త, నభా నటేష్ నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: భువన్, శ్రీకర్, సమర్పణ: ఠాగూర్ మధు, కెమెరా : కె.కె.సెంథిల్ కుమార్, సంగీతం: రవి బస్రూర్, ఎడిటర్: తమ్మిరాజు, డైలాగ్స్: విజయ్ కామిశెట్టి, ప్రొడక్షన్ డిజైనర్లు: ఎం ప్రభాహరన్, రవీందర్, యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి.
పవర్ఫుల్ కథతో ‘స్వయంభూ’
- Advertisement -
- Advertisement -



