Sunday, April 12, 2026
E-PAPER
Homeఆటలుఆయుష్‌ అదరహో

ఆయుష్‌ అదరహో

- Advertisement -

వరల్డ్‌ నం.1పై సంచలన విజయం
ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌
నింగ్బో (చైనా) :
భారత యువ షట్లర్‌, వరల్డ్‌ నం.25 ఆయుష్‌ శెట్టి అదరగొట్టాడు. 2023 ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో జూనియర్‌ చాంపియన్‌గా నిలిచిన ఆయుష్‌ శెట్టి.. మూడేండ్ల తర్వాత సీనియర్‌ సర్క్యూట్‌లో సంచలనాల మోత మోగిస్తున్నాడు. చైనాలోని నింగ్బోలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో వరల్డ్‌ నం.1, థాయ్‌లాండ్‌ షట్లర్‌ కునాల్‌ విటిడ్‌శరణ్‌పై మూడు గేముల మ్యాచ్‌లో ఆయుష్‌ శెట్టి ఘన విజయం సాధించింది. 10-21, 21-19, 21-17తో ఆయుష్‌ శెట్టి అద్భుత విజయం ఖాతాలో వేసుకున్నాడు. 75 నిమిషాల ఉత్కంఠ సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌కు షాకిచ్చి ఫైనల్లోకి ప్రవేశించాడు ఆయుష్‌. నేడు టైటిల్‌ పోరులో వరల్డ్‌ నం.2, చైనా షట్లర్‌ షి యు కితో ఆయుష్‌ శెట్టి తలపడనున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -