పల్లవి : యాది కొచ్చేనా తమ్ముడూ,
ట్రంప్ గాని యుద్ధం యాది కొచ్చేనా తమ్ముడూ!
యాది కొచ్చేనా తమ్ముడూ,
ట్రంప్ గాని యుద్ధం యాది కొచ్చేనా తమ్ముడూ||
అమెరికోడి ఆగడాలు యాదికొచ్చినా తమ్ముడూ,
పంటకీ పాడికీ పన్నులంటాడాయె తమ్ముడూ,
ఇంటికీ ఒంటికీ సమురైనా రానీడాయె, తమ్ముడూ,
పన్ను మీద పన్ను లాయె, పరపతి లేదాయె తమ్ముడూ ||
యాది కొచ్చేనా!!
అమెరికోడి ఆగడాలు యాది కొచ్చేనా తమ్ముడూ,
నాడు ఇరాక్ పై దాడులు యాది కొచ్చేనా తమ్ముడూ,
సద్దాంను సంపిన రోజులు యాది కొచ్చేనా తమ్ముడూ,
వాడు ముద్దాడిన తోలు బొమ్మ రాజ్యం
యాది కొచ్చేనా తమ్ముడూ !! యాది కొచ్చేనా !!
అమెరికోడి ఆగడాలు యాది కొచ్చేనా తమ్ముడూ,
వెనుజులా పై దాడులు యాది కొచ్చేనా తమ్ముడూ,
ట్రంప్ గాడి బరితెగింపు యాది కొచ్చేనా తమ్ముడూ,
గాజా లో ఆకలి కేకలు యాది కొచ్చేనా తమ్ముడూ ||
యాది కొచ్చేనా !!
అమెరికోడి ఆగడాలు యాది కొచ్చేనా తమ్ముడూ,
ఆరుగాలం వాడి యుద్ధ గాలాలు యాది కొచ్చేనా తమ్ముడూ,
నేడు ఇరాన్ పై దాడులు యాది కొచ్చేనా తమ్ముడూ,
ఆయెతుల్లా ఖొమైనీ హత్య యాది కొచ్చేనా
తమ్ముడూ !!యాది కొచ్చేనా!!
అమెరికోడి ఆగడాలు యాది కొచ్చేనా తమ్ముడూ,
జగడం లేదు, జాడ్యం లేదు,జెండా లేదురా తమ్ముడూ,
జాతి లేదు, మతం లేదు, మమత చాటరా తమ్ముడూ,
శాంతి మంత్రం మ్రోగించి ట్రంప్ ఒంపు తీయరా తమ్ముడూ !!యాది కొచ్చేనా!!
బోడపాటి అప్పారావు, 9381509814
యాది జేస్తుంటి తమ్ముడూ
- Advertisement -
- Advertisement -



