Sunday, April 12, 2026
E-PAPER
Homeసోపతిసోషలైజేషన్‌ లోపం!?

సోషలైజేషన్‌ లోపం!?

- Advertisement -

అభివద్ధి అంటే భవంతులుకాదు, మనుషుల ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు అంటాడు బాబా సాహెబ్‌ అంబేద్కర.్‌ కానీ ఇవ్వాల్టి సమాజం అంతా తిరోగమన దిశలో ప్రయాణిస్తుంది. మనం సాంకేతికంగా విశ్వంతరాల్లో ఉన్న రహస్యాల్ని ఛేదించగలిగే టెక్నాలజీని కలిగి ఉన్నం కానీ మన మనస్సు లోతుల్లో దాగిన రహస్యాలను మాత్రం అర్థం చేసుకోవడంలో దారుణంగా విఫలం అయ్యామని చెప్పవచ్చు. అందుకే నేటి సమాజమంతా సోసలైజెషన్‌ లోపం అనే మానసిక వైఫల్యంలో కొట్టుమిట్టాడుతుంది.

సోషలైజెషన్‌ అంటే సామాజికంగా ఎదుటి వారిని ఏవిధంగా అర్థం చేసుకోవాలి, నలుగురిలో కలిసి ఎలా ప్రవర్తించాలి వంటి మానసిక నైపుణ్యాలను ప్రధానంగా బుద్ధిమాంద్యం లేదా ఆటిజం, మానసిక, బిహేవియర్‌ సమస్యలున్న పిల్లలు, పెద్దలకు సైకాలజిస్టులు బిహేవియర్‌ మోడిఫికేషన్‌ థెరపీ ద్వారా నేర్పిస్తారు. కానీ ఇప్పుడు మొత్తంగా సమాజానికి ఈ థెరపీ అవసరం ఏర్పడింది.
మానసికంగా గాడి తప్పి, ప్రవర్తన లోపించిన ఈ మనుషులందరికి థెరపీ అవసరమే కానీ ఎంతమేరకు సాధ్యం అనేది సమాధానం దొరకని ప్రశ్న.
చదువులో ర్యాంకులు, డిగ్రీలు పొంది ఉన్న యువకుల నుండి మొదలు కొని నడివయసు దాటిన పెద్దల వరకు సోషలైజెషన్‌ లోపించింది.
ఎదుటివారి భావాలను, ఆలోచనలను అర్థం చేసుకోవడంలో, నలుగురిలో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనే విచాక్షణ జ్ఞానం కోల్పోయి ఉన్నారు.
ఇంటెలిజెన్స్‌ అనేది ర్యాంకులు, డీగ్రీలను అందిస్తే, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది ఉన్నతమైన ప్రవర్తన, నడవడికను అందిస్తుంది. అంటే ఎదుటివారి భావాలు(empathy) అర్థం చేసుకోవడం, భిన్నాభిప్రాయాలను గౌరవించడం, తమసరిహద్దులు (boundaries) గుర్తించడం మొదలైనవి.
ఉన్నతమైన సంస్కతి, సంప్రదాయాలకు నిలయంగా చెప్పుకోబడిన ఈ దేశంలో ఆ ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ కోల్పోయిన మనుషుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కాబట్టి దీన్ని ఒక సోషల్‌, నేషనల్‌ డిసాస్టర్‌ లాగే గుర్తిస్తేనే పరిష్కారం సులువవుతుంది.
భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసే బుద్ధిజీవుల పట్ల, ప్రత్యేకంగా మహిళలపట్ల సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ రూపంలో బూతుల, రాతల దాడిని గమనిస్తే అర్థం చేసుకోవచ్చు.

ఈ ప్రవర్తనకు కొన్ని ప్రధాన సైకాలజికల్‌ కారణాలు:
జీవితంలో అసంతప్తి వైఫల్యాలు, ఉద్యోగ, వ్యక్తిగత, కుటుంబ సమస్యల లోపాన్ని సోషల్‌ మీడియాలో కామెంట్స్ర్‌ రూపంలో నా అభిప్రాయం మాత్రమే సరైనదనే˚ rigid thinking తోపాటు Confirmation bias (తనకు నచ్చింది, తెలిసిందే నిజం అనే మానసిక భ్రాంతిలోఉండటం.
కోపాన్ని నియంత్రించలేక పోవడం, వెంటనే రియాక్ట్‌ అవ్వడం (impulsivity).
సోషల్‌ మీడియాలో అసలు పేరు లేకుండా (anonymous) అకౌంట్స్‌తో ఎవరూ నన్ను పట్టుకోలేరు, ఏం చేయలేరు అనే ధైర్యం.
ప్రత్యేకంగా యువతలో ఐడెంటిటీ క్రైసిస్‌ వల్ల కులం మతం, రాజకీయాలు, సినీనటులు, క్రికెట్‌ టీం, రాజకీయాలనే తమ ఐడెంటిటీగా నిర్మించుకోవడం. దానివల్ల ఎవరైనా తమ కుల,మత నాయకున్నో, తమ అభిమాన హీరోని, రాజకీయ నాయకున్నో, మతవిశ్వాసాన్ని ప్రశ్నించడమో, విమర్శించడమో చేస్తే వెంటనే ఎమోషనల్‌ సెల్ఫ్‌ రెÛగ్యూలెషన్స్‌ కోల్పోయి, విపరీతమైన కోపం, ఆవేశంతో ప్రవర్తించడం మనం రోజూ చూస్తున్న వాస్తవిక చరిత్రే.
ఈ దాడుల్లో ఎక్కువగా మహిళలే ఎందుకు టార్గెట్‌ అవుతున్నరంటే ఈదేశంలోని పురుషుల మెదళ్ళకు వారసత్వంగా వస్తున్న పితస్వామ్య మహిళ వ్యతిరేక భావజాలం వల్ల మహిళల స్వేచ్ఛను అంగీకరించలేక పోవడం, మహిళలపై పట్టు కోల్పోతున్నామన్న భావన వల్ల, వారిపై కారెక్టర్‌ అసాసినేషన్‌, బూతులు, మోరల్‌ పోలిసింగ్‌, మానసిక హింస అనేవి మహిళపై నిత్యకృత్యంగా మారాయి.
ఈ దాడులు చేసేవారిలో ఎక్కువగా చదువుతున్న, చదువుకున్న పట్టభద్రులు, ఉద్యోగస్తులే ఉండటం మరింత విచారకరం.
గడిచిన కాలమంతా మహిళలను అభివద్ధి, చైతన్యపథంలో నడిపేందుకు కషిచేసిన సమాజమంతా కూడా, చైతన్యవంతమైన మహిళలపట్ల ఏవిధంగా నడుచుకోవాలి? వారికి ఏవిధంగా దారి ఇవ్వాలి అనే అంశంపట్ల బోధించడం మర్చిపోయింది.
చుట్టూతా తాము ఏర్పరుచుకున్న సమాజం, స్నేహితుల ప్రభావం వల్ల విద్వేషపూరిత ఆలోచనలు, మాటలు, బూతులు అనేవి చాలా నార్మలైజ్‌ అవ్వడంవల్ల ఆత్మపరిశీలన చేసుకునే అవకాశం ఉండదు.
నెగెటివ్‌ ప్రవర్తనవల్ల లైక్స్‌, కామెంట్స్‌, షేర్స్‌ ద్వారా పొందే అటెన్షన్‌ వల్ల వారిలో డోపమైన్‌ అనే హార్మోన్‌ క్రియాశీలకంగా మారడం మరో ప్రధాన కారణం.



సైకాలజికల్‌ సలహాలు, పరిష్కారాలు:
రూట్స్లేదా పునాది నుంచే అంటే పాఠశాల స్థాయి నుంచి మొదలుకొని కళాశాల వరకు విద్యార్థుల్లో కేవలం మార్కుల కోసం గాకుండా లైఫ్‌స్కిల్స్‌, వ్యక్తిత్వ నైపుణ్యాలు, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ మొదలైనవి సైకాలజిస్టుల సహాకారంతో పెంపొందించాలి.
ఆత్మపరిశీలన ద్వారా మన భావోద్వేగాలను గుర్తించడం (నేను కోపంగాఉన్నానా? బాధగా ఉన్నానా?), నేను ఈ సందర్భంలో ఎందుకు ఇలా రియాక్ట్‌ అయ్యాను? అని ఆలోచించగలిగితే ఇంపల్సివ్‌ రియాక్షన్‌ తగ్గుతుంది.
డిజిటల్‌, సోషల్‌ మీడియాపై నియంత్రణ ఉంటే కామెంట్‌ చేయడానికి ముందు 10-15 సెకన్లు ఆగడం, ఈ కామెంట్‌ ఎదుటి వారిని బాధపెడుతుందా? అని ఆలోచించడంతో పాటు అనవసరపు జోక్యం తగ్గించుకోవడం వల్ల సోషల్‌ మీడియాలో హేట్‌ స్పీచ్‌ తగ్గే అవకాశం ఉంటుంది.
సైకాలజికల్‌ ఇంటర్వెన్షన్‌లో సైకో ఎనాలిసిస్‌, బిహేవియర్‌ మోడిఫికేషన్‌ థెరపీ, కొగెటివ్‌ బిహేవియర్‌ థెరపీ ద్వారా మనిషి ఆలోచనలు, భావాలు, ప్రవర్తనలో మార్పులు, కోపం అదుపులో ఉండటం జరుగుతాయి.

సానుభూతి శిక్షణ (Empathetic Training) ద్వారా
ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, వారిస్థానంలో నేను ఉంటే ఎలా? అని ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది.
శాస్త్రీయ, తార్కికజ్ఞానం, విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడం, సమాజంలో ఆది నుంచి వేళ్లూనుకుని మూఢనమ్మకాలను తగ్గించడం, ‘ఇదినిజమేనా?’ అని ఆలోచించడం, ప్రశ్నించడం వల్ల సమూలమైన మార్పును ఆశించవచ్చు.
వార్త, సినిమా, రాజకీయ రంగాలు సోషల్‌ కన్సర్న్‌ కలిగి ఉండటం అత్యంత అవసరం. దీనివల్ల ఫేక్‌న్యూస్‌తో పాటు హేటెడ్‌ స్పీచ్‌ తగ్గుతుంది. వీటిపై ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించి వాటి అమలుకు కషి చేయాలి.
కుటుంబాలు, సమాజం గుడ్డినమ్మకాలను ప్రొత్సహించకుండా ఉంటూ తార్కికంగా ఆలోచించేలా అంటే ‘ఇది మా సంప్రదాయం కాబట్టి’ అనే మాటతో కాకుండా ‘ఇది ఎందుకు?’ అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా ముఖ్యం.
పౌరులు భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదం అర్థం చేసుకోలేక పోవడం, మతాలు రాజకీయ ప్లాట్‌ఫాం కావడం అతిపెద్ద సామాజిక సమస్య.
సోషలైజేషన్‌ లోపం ఇప్పుడు ఒక సైలెంట్‌ సోషల్‌ క్రైసిస్‌గా మారుతోంది కాబట్టి ఇది ఒక్క థెరపీతో పరిష్కారం కాదు, ఈ దేశంలో క్రీయశీలక పాత్ర పోషిస్తున్న వ్యవస్థలన్నీ ముందుకు రావాలి.

హరిష్‌ ఆజాద్‌ (సైకాలజిస్ట్‌)
7382173741

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -