భారత రాజ్యాంగ నిర్మాత, నిమ్నకులాల విముక్తి ప్రదాత భారత రత్న డా||బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని దేశప్రజలు, ముఖ్యంగా నిమ్నకులాలు అత్యంత విధేయతతో జరుగపుకుంటున్నాయి. తమ మేలుకోరి తన జీవితాన్ని త్యాగం చేసిన అంబేద్కర్ మహానీయుడికి ఈ దేశంలోని దళిత, బలహీన వర్గాలు తమ విధేయతను ప్రకటిస్తూనే ఉంటాయి. అస్పృశ్యులు ఎదుర్కొన్న అవమానాలన్నిటినీ ఎదుర్కొన్న కసితో అంబేద్కర్ తన యావత్ జీవితాన్ని, చదువును దళిత సమస్యల పరిష్కారానికి వెచ్చించాడు. అయితే అంబేద్కర్ తన మేదస్సును కేవలం దళిత సమస్యకే పరిమితం చేయలేదు. దేశ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, తాత్విక రంగంలో ఆయన కృషి చాలా విలువైనది. ఈ దేశం నేడు మనుగడ సాధిస్తున్న లౌకిక, ఫెడరల్ వ్యవస్థల నిర్మాణంలో అంబేద్కర్ కృషి వెలకట్టలేనిది. అంబేద్కర్ చేసిన విభిన్న విశ్లేషనలను బట్టి చూస్తే దేశ అగ్రనాయకుడిగా గుర్తింపు పొందాల్సిన ఆయన భారతీయ స్మృతిపథంలో అంటరాని మేధావిగానే మిగిలిపోయారు.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన గొప్ప దార్శనీకుడు. ఆచరణలో అది ఇప్పటికే రుజువయ్యింది. మానవుడు రోజురోజుకు వాస్తవానికి దగ్గరౌతాడనే తాత్వికత విషయంలో భారత మేధావులు అంబేద్కర్‌ను మరింత లోతుగా అర్ధం చేసుకుంటారు. ప్రపంచంలో మేధావిగా గుర్తించబడ్డవారు కాని, సిద్దాంతం కూడా సంపూర్ణమైనది కాదు. అలాంటిది ఏదైనా ఉందంటే అది అభివృద్ధి నిరోధకమైనదే. అంబేద్కర్ కూడా దీని పరిధికి అవతల ఉండలేదు. అంబేద్కర్ గొప్పదనాన్ని అంగీకరించడానికి సిద్ధపడని వారు అంబేద్కర్ చెప్పిన విషయాలలోనే వైరుద్ధ్యాన్ని వెతికి ”చూశారా.. ఏం చెబుతున్నాడో అంబేద్కర్‌కి క్లారిటీ లేదు” అని స్టేట్మెంట్లు ఇస్తుంటారు. సాధారణ సూత్రీకరణలను నిర్దిష్టీకరించవచ్చు కాని నిర్దిష్ట విషయాన్ని సాధారణీకరించటం తగదు.

మిడిమిడి ఆలోచనలు ప్రమాదం
ఒక్కొక్క విషయం ఒక దశలో, నేపథ్యంలో ఒకలా రావచ్చు. అంబేద్కర్ విషయంలో కూడా అలాంటి సంఘటనలను ఆసరాగా చేసుకుని ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేసే కూహాన మేధావులు చాలా మందే ఉన్నారు. అయితే అంబేద్కర్‌ని సరైన పద్ధతిలో అర్థం చేసుకున్న వారి కంటే చేసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారు అంబేద్కర్ వర్ధంతులు, జయంతులు వద్ద మెక్కుబడికి ఆయన గొప్పదనాన్ని పొగుడుతారు. పక్కకెల్లి విస్మరిస్తారు. ఇది ప్రమాదకర ధోరణి. మార్క్సిజాన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కాని మిడిమిడి ఆలోచనలు ప్రమాదం అన్న విషయం ఇక్కడ కూడా వర్తిస్తుంది. దేశంలో రాజకీయ, సాంస్కృతిక, సాంఘీక జీవనం సామాజిక సమూహాల రూపంలో సంఘటితమౌతున్నది. దీనిని సరైన పద్దతిలో అర్థం చేసుకోలేని వారు ఆ సమూహాల నుండి దూరం అవుతూనే ఉంటారు. దేశరాజకీయ సాంస్కృతిక చిత్రపటంపై అది ఆవిష్క్రతమైంది. ఈ సమూహాల మధ్య ఉండే వైరుధ్యాలు, అ సమూహాలు మిగతా అగ్రకుల వ్యవస్థకు గల వైరుధ్యాన్ని సక్రమంగా అర్ధం చేసుకోవటానికి దిక్సూచిగా ఉపయోగపడుతుంది.
అగ్రకులతత్వంతో…
అంబేద్కర్ తనదైన దృక్పథంలో అవసరమైన విషయంలపై తన అవగాహనను వెలువరించారు. ఆయన గొప్పమేధావి, భౌతికవాది, స్త్రీవాది, గొప్ప ప్రజాస్వామికవాది, లౌకికవాది, సమాఖ్యవాది, తాత్వికుడు, శాంతికాముకుడు, అంటరాని కులాల హక్కుల యోధుడు. కులం సంఘటితమైన అనంతరం భావదారిద్య్రానికి, శాస్త్రీయదృక్పధ దారిద్య్రానికి గురైన భారత దేశం, అది తయారు చేసిన ఎక్కువ మంది మేధావులకు తమ పాక్షిక దృష్టికోణమే మహామేధావితనంగా కనిపిస్తుంది. అమెరికాలో నీగ్రోల హక్కుల కోసం పోరాడిన యోధుడు మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణ ఆఫ్రికా మహానేత నల్లజాతి సూర్యుడైన నెల్సన్ మండేలాలో చూసిన నాయకుడిని మాత్రం అంబేద్కర్‌లో చూడలేకపోతున్నారు. కారణమేమంటే వీరి కళ్ళను అగ్రకులతత్వం అనే పొరకమ్మివేయటమేనని చెప్పుకోక మరేం చేయగలం. గడిచిన గతం నుండి వర్తమాన్ని చూడిపయత్నించే వారు అంబేద్కర్‌ని లోతైన పరిశీలను చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయలేని వారు మావో చెప్పినట్లుగా మౌనాన్ని పాటించాలి కాని అపరిపతక్వ వాఖ్యానాలు మానుకోవాలి.

విస్మరించజాలం…
ప్రపంచ వ్యాపితంగా పీడిత ప్రజానికం తమ విముక్తి సాధనంగా మార్క్సిజాన్ని ఆశ్రయించారు. భారత దేశంలో ఆ ప్రజల మహోన్నతికి కృషి చేసిన అంబేద్కర్ మాత్రం మార్క్సిజాన్ని తన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించలేదు. అయినా ఆయన పీడిత ప్రజల నాయుకుడే. కమ్యూనిస్టు కానంత మాత్రాన పోరాటయోధుల కృషి తక్కువ చేయబడదు. స్వీకరించి వుంటే బాగుండు, కాలేదు. అంతమాత్రంచే కమ్యూనిస్టులు ఆయన కృషిని ప్రశంసించవద్దా? బేషరతుగా ఈ దేశంలో ఆయన నిమ్నకులాల విముక్తికి నిర్విరామకృషి చేసిన నాయకుడు. ఆధునిక భౌతికవాదానికి ఆధ్యుడైన ప్యూయెర్బాక్ కొంత కాలం అనంతరం కమ్యూనిస్టులను వీడిపోయాడు. అయినంత మాత్రాన ఆయన భౌతికవాదాన్ని విస్మరించగలమా? ఆయనను మార్క్స్ కొనియాడలేదా? సన్‌యెట్‌సేన్ పోరాటాన్ని ఆయన కమ్యూనిస్టు కాడన్న పేరుతో నిరాకరించనట్టే అంబేద్కర్ పోరాటాన్ని కూడా విస్మరించజాలం.
ఆనాటి సామాజిక స్థితిగతులే నడిపించాయి
మానవుడికి ఆలోచనల పరంపర ఆకాశం నుండి ఊడిపడదు. తన చుట్టు పరిస్థితుల నుండే ఏర్పడుతుందని భౌతికవాదులందరికి తెలిసిందే. అంబేద్కర్ దీనికి అతీతుడు కాదు. ఆనాటి స్థితిగతుల నుండి అంబేద్కర్‌ని వేరు చేసి పరిశీలన చేయవద్దు. ఆనాటి సామాజిక ఆర్ధిక స్థితిగతులు ఆయనను అలా నడిపించాయి. 1936 వరకు అంబేద్కర్ కార్యకలాపాలు తీవ్రవాద ఆర్థిక విధానాలతో మొదలయ్యాయి. కొంకణ్ భూస్వాముల వ్యతిరేక పోరాటం, కార్మిక సమ్మెలలో ఆయన వర్గదృక్పథాన్ని చూడవచ్చు. ఆయన స్థాపించిన ఇండియన్ లెబర్ పార్టీ పతాకం కమ్యూనిస్టుల పతాకంలా అరుణ పతాకమే. అలా ఆయన వామపక్ష దోరణి చాలా దూరమే నడిచింది. అయితే చివరకు రాజ్యాన్ని నిరాకరించే కమ్యూనిజం కన్నా రాజ్యం సామాజిక న్యాయాన్ని అందించాలనే భావనకు వచ్చాడు.
సామ్రాజ్యవాద ఏజెంట్‌డి యుద్ర
స్వాతంత్రోద్యమకాలంలో తిలక్ కాలం నుండే సామాజికోద్యమకారులు సామ్రాజ్యవాద ఏజెంట్లుగా చూపబడ్డారు. ఇది మహాత్మ జ్యోతిబాపూలే నుండి అంబేద్కర్ దాకా కొనసాగింది. స్వాతంత్రోద్యమంలో జాతీయ బూర్జువాలకు సామ్రాజ్యవాదులకు వైరుద్యం పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో నిమ్నకులాల ప్రయోజనాలకు జాతీయబూర్జువాలకు వైరుధ్యం ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన వైరుధ్యం పరిష్కరించుకోవచ్చు అని జాతీయేద్యమనాయకత్వం, కాదు ఇప్పుడే అని అంబేద్కర్ పట్టుబట్టారు. అ సంఘర్షనే అంబేద్కర్‌ను సామ్రాజ్యవాద ఏజెంట్ అనే ముద్రవేయటానికి కారణం.
బ్రిటీష్ కుయుక్తులకు సహాయపడ్డది ఎవరు?
1928లో ముస్లీం రిజర్వేషన్లకు సరేనన్న భారత జాతీయ కాంగ్రెస్ దళితులకు మాత్రం రిజర్వేషన్లు వద్దు అంది. 1932లో కమ్యూనల్ అవార్డు ద్వారా దళితులకు అందిన ప్రత్యేక నియోజకవర్గాలకు నిరాహారదీక్ష చేసి పూనా ఒడంబడిక ద్వారా రద్దు చేసిన గాంధీ 1916లో లక్నో ఒప్పందం ద్వారా ముస్లీంలకు రిజర్వేషన్లను సమర్థించింది. అసలు ప్రత్యేక నియోజకవర్గాలనే అంబేద్కర్ వ్యతిరేకించాడు. అందరికి వయోజన ఓటు ఇవ్వమన్నాడు. కుదరని పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యేక నియోజకవర్గాలు అడిగిన విషయాన్ని విస్మరించరాదు. ”ముస్లీం రిజర్వేషన్లకు వ్యతిరేకంకాదు కాని హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలిస్తే నా ప్రాణాన్ని అడ్డుపెట్టయినా అడ్డుకుంటా”ననటం ద్వార విభజించు పాలించు అనే బ్రిటీష్ కుయుక్తులకు సహాయపడ్డది గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ తప్పా అంబేద్కర్ కాదు.
మిత్రవైరుధ్యమే…
కమ్యూనిస్టులు పీడితుల శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడినా కులాన్ని సామాజిక అంశంగా గుర్తించి దాని రూపాలపై దృష్టి తగినంత కేంద్రీకరించలేదు. ఆ సమయంలో ఒంటెత్తు పోకడలకు గురికావటం, ఎక్కువ మంది యువనాయకులు ఉన్నత కులాల నుండే రావటం కూడా కమ్యూనిస్టులను అంబేడ్కర్ అనుమానించటానికి కారణంగా చెప్పినా అదే సంపూర్ణ కారణం కాదు. భారతదేశంలో కుల సమస్య మతంలో ముడిపడి ఉంది. కులం నిర్మూలించబడాలంటే మతం కూడా నాశనం కావాలి. కాని మతం నిర్మూలించటం వెంటనే సాధ్యం అయ్యో విషయం కాదు. కనుక కులవ్యతిరేక పాత్ర పోషించిన బౌద్ధం, ప్రజాస్వామిక విలువలు, శాంతి మూలాలపై ఏర్పడ్డ బౌద్ధం సరైందిగా భావించాడు. భారతీయ కార్మికవర్గం వివిధ కులాలతో కలిసి ఉన్నందున అది విప్లవకర పాత్ర పోషించలేదని భావించాడు. మార్క్సిజంలోని కార్మికవర్గ నియంతృత్వంలో దళితుల అభివృద్ధి కన్నా సంస్కరణవాద పార్లమెంటరీ విధానమే తోడ్పడుతుందని భావించాడు. ఏమైనా అంబేద్కర్ వర్గదోపిడిని, వర్గపోరాటాన్ని అంగీకరిస్తూనే దానికి గల రాజకీయ విప్లవకార్యాచరణను అంగీకరించకపోవటానికి సిద్ధపడలేదు. వాస్తవిక భూమికపై కూమ్యూనిస్టులకు అంబేద్కర్‌కి ఉన్న వైరుధ్యం మిత్రవైరుధ్యమే కాని శత్రువైరుధ్యం కాదు.
కాడిగల్ల భాస్కర్, 9550603889



