Sunday, April 12, 2026
E-PAPER
Homeజోష్డెలివరీ బాయ్ టు కరెంట్‌ అఫైర్స్‌ వయా స్టడీ లాజిక్స్‌

డెలివరీ బాయ్ టు కరెంట్‌ అఫైర్స్‌ వయా స్టడీ లాజిక్స్‌

- Advertisement -

జీవితంలో ఏదైనా పని చేసినా అందులో విజయం సాధించాలంటే ప్రతి వ్యక్తికి తెలివితేటలు, విచక్షణ అవసరం. జీవితంలో తెలివితేటలు ఉన్న వ్యక్తికి బలం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో తెలివితేటలు కలిగి ఉండడాలి అనడానికి ఇదే కారణం. ఈ తెలివితేటలతో ప్రతి ఒక్కరూ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారు అనడానికి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన యర్రా శివకుమార్‌ ఒక రోల్‌ మోడల్‌. తాను పోటీ పరీక్షలకు సిద్ధం అవుతూ తనలా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి ఉపయోగపడేలా ’12 నెలల కరెంట్‌ అఫైర్స్‌ – రాశాడు. మార్కెట్‌ లో కూడా దానికి మంచి డిమాండ్‌ ఉంది. అంతేకాదుStudy Logics అనే యూట్యూబ్‌ ఛానల్‌, ఇన్‌ స్టా పేజి నడుపుతూ 270K ఫాల్లొవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఇది నిజంగా స్ఫూర్తి వంతం. ఆ యువకుడి జర్నీ నేటి జోష్‌లో…

చిన్నప్పటి నుండి ఏ విషయాన్ని తెలుసుకున్నా/ నేర్చుకున్నా, క్లాస్‌లో నలుగురికి అర్థం అయ్యేలా చెప్పడం అతడికి ఇష్టం. ఆ ఇంట్రెస్ట్‌తోనే ఏ విషయం చదివినా కొంచెం ఎక్కువ అనలిటికల్‌గా చదివేవాడు.. ఏది చదివినా దానిని బాగా మననం చేసుకునేవాడు. గుర్తు పెట్టుకుంటాడు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అయితే ఆ బడిలో అప్పుడు తెలుగు టీచరే లేరు. అయినా పట్టుదలతో తాను చదుకున్నాడు… తాను నేర్చుకోవడంతోపాటు మిగతా విద్యార్థులకు కూడా తానే తెలుగు నేర్చించేవాడు. అలా తెలుగు భాషపై మంచి పట్టు సాధించాడు. అంతే కాదు పదోతరగతిలోనే అందరికి అర్థమయ్యేలా పాఠం ఎలా చెప్పాలో కూడా నేర్చుకున్నాడు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పాల్గొనడం..బహుమతులు అందుకోవడం తనపై తనకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది.

ప్రజాశక్తి పేపర్‌ చదివేవాణ్ని
చిన్నప్పటి నుండే ప్రపంచం, దేశ, రాజకీయ వ్యవస్థ వీటన్నింటి మీద ఎంతో కొంత అవగాహన ఏర్పడింది. దీనికి ప్రజాశక్తి పేపరే కారణం అంటాడు శివ. ప్రతిరోజు ఇంటికి వచ్చే ప్రజాశక్తి పేపర్‌ చదివి అనేక విషయాలపై అవగాహన పెంచుకునే వాడు. ఇంటర్‌లో ఉండగా కేవలం చదవు తప్ప మరో ద్యాస లేకుండా పోయింది. దీంతో ఎక్కడో తనని తాను కోల్పోతున్న ఫీలింగ్‌ కలిగింది. ఆ చదువు కేవలం మార్కులకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప సరైన జ్ఞానాన్ని ఇవ్వదని గ్రహించాడు. మరల తన రొటీన్‌ లైఫ్‌కి మారిపోయి డిగ్రీ కూడా పూర్తి చేశాడు.



సినిమా లైఫ్‌ నాకు క్రియేటివిటీని నేర్పింది
ఆ తర్వాత పీజీ చేస్తుండగా షార్ట్‌ ఫిలింస్‌ తీయాలని ఒక కొత్త ఇంట్రెస్ట్‌ ఏర్పడింది. ఆ ప్రయత్నంలో తరచుగా హైదరాబాద్‌ వస్తూ షార్ట్‌ ఫిలిం ఇండిస్టీలో ఉన్న కొంత మందిని కలుస్తూ ఉండేవాడు. ఆ జర్నీలో కథలు రాసుకున్నాడు. చిన్న చిన్న షార్ట్‌ ఫిలింస్‌ ప్రయత్నించాడు కూడా. కానీ దానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఇబ్బంది వచ్చింది. ఎడిటింగ్‌ కాస్ట్‌ కూడా చాలా ఎక్కువగా ఉండేవి. ”మనమే నేర్చుకుంటే మనకి ఈజీ అవుద్ది” అని ఎడిటింగ్‌ నేర్చుకున్నాడు. దానితో పాటు గ్రాఫిక్‌ డిజైనింగ్‌ కూడా నేర్చుకున్నాడు. ‘అలా సినిమా లైఫ్‌ తనకు క్రియేటివిటీని నేర్పింది. సినిమాల వైపు వెళ్లాలనుకున్నాడు. కానీ పరిస్థితుల రీత్యా ముందుకు వెళ్లలేకపోయాడు. దీంతో ఒక మానసిక సంఘర్షణ జరింది. తనకు తానుగా ”నేను దేంట్లో అయితే రాణించగలను” అని అంచనా వేసుకున్నాడు. తన కండ్ల ముందు మెరిసింది ఒక్కటే.. అదే పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌. అంతే మరో ఆలోచన లేకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఆర్థిక స్థోమత లేదు
పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వాలని బలంగా నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్‌ అయితే వచ్చాడు.. కానీ కోచింగ్‌ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. సొంతంగా ప్రిపేర్‌ అవ్వడానికి సిలబస్‌ మీద అవగాహన లేదు. ఎక్కడి నుండి స్టార్ట్‌ చేయాలో తెలీదు.. కానీ ఏదో సాధించాలన్న పట్టుదల, నమ్మకం ముందుకు నడుపుతుంది. కాబట్టి చదువుకోడానికి ఒక ప్లేస్‌ కావాలి! స్టడీహాల్‌ కి నెలకి 900/- కట్టాలంటే కష్టమే.. ఆ పరిస్థితుల్లో అఫ్జల్‌ గంజ్‌ సెంట్రల్‌ లైబ్రరీ ఎంచుకున్నాడు. ఆ దగ్గర్లోనే ఉంటున్న అమ్మమ్మగారి ఇంట్లో ఉంటూ సెంట్రల్‌ లైబ్రరీకి వెళ్లి చదువుకోవడం మొదలుపెట్టాడు.

అక్కడ మొదలైంది ఈ కాంపిటేటివ్‌ జర్నీ..
రోజూ ఉదయం 8:00 గం||లకు వస్తే సాయంత్రం 8:00 గం||ల వరకు అక్కడే గడిపేవాడు. సిలబస్‌ అర్థం అయ్యేది కాదు మళ్ళీ మళ్ళీ చదువుతూ, సీనియర్స్‌ సలహాలు తీసుకుంటూ రోజంతా అక్కడే గడిచిపోయేది. అప్పుడే జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్‌ పడింది. 6 నెలల తర్వాత ఆ ఎంట్రెన్స్‌ రాశాడు. తను పడిన కష్టానికి ఆ ఉద్యోగానికి సెలెక్ట్‌ అవుతాడని అనుకున్నాడు. కానీ, కేవలం నాలుగు మార్కులతో ఆ జాబ్‌ మిస్‌ అయింది.

డిప్రెషన్‌కు లోను కాకుండా
పంచాయతీ సెక్రటరీ ఉద్యోగానికి సెలెక్ట్‌ కాలేదు. అయినా డిప్రెషన్‌ కు గురి కాలేదు. పైగా దాని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. జీరో నుండి మొదలుపెట్టి సొంత ప్రిపరేషన్‌ తోనే కటాఫ్‌ వరకు వెళ్ళగలిగాడు. ‘I Can do more’ అని తనకు తానే ధైర్య వాక్యం పలుకుకొని సన్నద్ధం అవుతున్నాడు. కానీ, ఏ నోటిఫికేషన్‌ లేదు.. మరి రెగ్యులర్‌ గా ఉండే నోటిఫికేషన్స్‌ ఏంటి అని చూసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్‌ లేవు. ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. నోటిఫికేషన్స్‌ లేకపోవడంతో హైదరాబాద్‌ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రత్నామ్నాయ ఉద్యోగాలు ఏమి ఉన్నాయా అని వెతకడం మొదలుపెట్టాడు. యూపీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్స్‌ చూశాడు. అలా తొలిసారి సివిల్స్‌ గురించి తెలుసుకున్నాడు. అప్లరు చేశాడు. ఇంటి దగ్గర నుండే ప్రిపర్‌ అయి ప్రిలిమ్స్‌ రాశాడు. దాని ద్వారా అసలు ప్రిపరేషన్‌ ఎలా ఉండకూడదో అర్థం అయింది. అప్పటి నుండి ప్రతి విషయాన్ని చదివే తీరు మారింది. అర్థం చేసుకునే విధానం మారింది. అన్ని సబ్జెక్ట్స్‌ మీద పూర్తి అవగాహన లేదు. కాబట్టి చాలా స్లోగా సెల్ఫ్‌ ప్రిపరేషన్‌ మరోసారి ప్రారంభించాడు. అలా చదువుతూ నోట్స్‌ రాసుకోవడం అలవాటు అయింది. మళ్ళీ నోటిఫికేషన్స్‌ వస్తాయి అని వార్తలు వస్తుండటంతో మరోసారి హైదరాబాద్‌ వచ్చాడు. ఈసారి మరో స్నేహితుడు కూడా వచ్చాడు.

డెలివరీ బాయ్ గా
ఇంటి నుండి ఖర్చులు తెచ్చుకునే పరిస్థితి లేదు. కానీ ప్రిపేర్‌ కావాలి…కాబట్టి ఏదో ఒక జాబ్‌ చేస్తూ చదవాలి! దాని కోసం ఇద్దరూ కలిసి కొన్ని రోజులు వెతుకులాట ప్రారంభించారు. చివరకు ఒక సంస్థలో డెలివరీ బాయ్ గా జాయిన్‌ అయ్యారు. అలా డెలివరీ బాయ్గా జాబ్‌ చేస్తూ ప్రిపేర్‌ అయ్యారు. కరోనా లాక్‌ డౌన్‌లో కూడా ఇంటికి వెళ్లలేని పరిస్థితి. భయంభయంగా హైదరాబాద్‌ లోనే బతకాల్సి వచ్చింది. కానీ, ఆ సమయానికి నోటిఫికేషన్స్‌ రాక ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వచ్చిన నోటిఫికేషన్లు పేపర్‌ లీకులతో చెరబడ్డాయి. ఇవన్నీ అనుభవిస్తూ మానసికంగా క్రుంగుతూ పని చేసుకోపోతే సిటీలో సర్వైవ్‌ అవ్వలేరు. ప్రిపేర్‌ అవ్వకపోతే ఉద్యోగం కొట్టలేరు. దీంతో తనకున్న క్రియేటివ్‌ స్కిల్స్‌తో రెండు మూడు ఫ్రీ లాన్సింగ్‌ జాబ్స్‌ చేయడం మొదలుపెట్టాడు.

స్టీడీ లాజిక్స్‌
కంటెంట్‌ ప్రిపేర్‌ చేస్తూ స్టీడీ లాజిక్స్‌ అనే ఇన్‌ స్టా పేజిని స్టార్ట్‌ చేశాడు. అటు ప్రిపరేషన్‌… ఇటు ఫ్రీలాన్సింగ్‌ జాబ్‌… మరోవైపు స్టీడీ లాజిక్స్‌ లో కంటెంట్‌ క్రియేట్‌ చేయడం. ఏంత మేనేజ్‌ చేసినా టైం సరిపోయేది కాదు. కంటెంట్‌ క్రియేట్‌ చేయాలి. వీడియో ఎడిటింగ్‌ చేయాలి. ప్రతీది కొత్తగా నేర్చుకుంటూ.. ముందుకు అడుగులు వేశాడే తప్ప ఎక్కడా కుంగిపోలేదు. ఇలా ఒక ప్లాట్‌ పామ్‌ ని మ్యానేజ్‌ చేస్తూ, రెండు రకాల ఉద్యోగాలు చేస్తూ.. చదువుకుంటూ, అదే సమయంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితులను బ్యాలెన్స్‌ చేస్తూ రావడం అనేది చాలా ఛాలెంజ్‌గా మారింది. అయినా ప్రిపరేషన్‌ను మాత్రం ఆపలేదు. పోటీ పరీక్షలు రాయడమూ ఆగలేదు. అయితే తన లాగానే ప్రిపరేషన్‌ అయ్యే వారు కూడా ఇలాగే ఇబ్బందులు పడుతుంటారని భావించాడు. తాను నేర్చుకున్నది పది మందికి పంచుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అప్పటికే ప్రారంభించిన స్టీడీ లాజిక్స్‌ ను నమ్మి ఫాలో అయ్యే అభ్యర్ధులకు మంచి కంటెంట్‌ ఫీడిఎఫ్‌ రూపంలో ఇవ్వడం మెదలుపెట్టాడు. మంచి ఆదరణ లభించింది. మంచి కంటెంట్‌ ఇస్తున్నాడు.. ఉపయోగపడుతుందన్న నమ్మకం ఏర్పడింది. అలా ఈరోజు 2 లక్షల70 వేల మంది ఫాలోవర్స్‌ ను తీసుకువచ్చింది.

ఈ బుక్‌ రాయడానికి అదే స్ఫూర్తి
‘కోల్పోయిన ప్రతీ చోట కొత్తగా వెతుక్కోడానికి ఒక దారి కచ్చితంగా ఉంటుంది అని నా జర్నీలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న- అంటాడు శివకుమార్‌. తాను షార్ట్‌ ఫిలిమ్స్‌ కోసం నేర్చుకున్న క్రియేటివ్‌ స్కిల్స్‌ Study logics page పెట్టడానికి ఉపయోగించుకున్నాడు. కెమెరా ముందు వీడియోస్‌ చేయడానికి, కంటెంట్‌ చేయడానికి ఉపయోగపడితే… తన కాంపిటేటివ్‌ జర్నీలో నేర్చుకున్న సబ్జెక్ట్‌ మొత్తం ’12 నెలల కరెంట్‌ అఫైర్స్‌- బుక్‌ రాయడానికి ఉపయోగపడింది. నేడు ఆ బుక్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ లభించింది. మార్కెట్‌లోకి విడుదలైన కొద్దిరోజులలోనే అన్ని కాపీలు అమ్ముడుపోయాయి. అంటే చిన్న వయసులోనే తాను ఒక గొప్ప అచీవ్మెంట్‌ రీచ్‌ అయ్యాడు.

ఓపిక.. సహనం చేర్చుకున్నా
జాబ్‌ రాలేదని నేనేమి డిప్రెషన్‌కి పోలేదు. ఎందుకంటే ఈ జర్నీ మొదలు పెట్టిన రోజు నాకేమి తెలీదు, కానీ ఈ జర్నీ నాకు ఓపికని నేర్పించింది.. సహనాన్ని నేర్పించింది.. డిసిషన్‌ మేకింగ్‌ని నేర్పించింది.. నలుగురికి అర్ధం అయ్యేలా ఒక సబ్జెక్టు ని డిస్కస్‌ చేయడం నేర్పించింది. – యర్రా శివకుమార్‌

అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -