Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసామాజికోద్యమాల రూపశిల్పి జ్యోతిరావు ఫూలే

సామాజికోద్యమాల రూపశిల్పి జ్యోతిరావు ఫూలే

- Advertisement -

– జయంతి సభలో పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

సామాజిక సంఘ సంస్కర్త, సామాజికోద్యమ నేత, మహిళా పక్షపాతి, సామాజికోద్యమాలకు రూపశిల్పి జ్యోతిరావు ఫూలే అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. శనివారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే 199వ జయంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్‌.రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళలర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక వివక్ష, స్త్రీ జాతి విముక్తి, సమానత్వం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ఫూలే అని చెప్పారు. దేశంలో అన్ని రకాల వివక్ష, అణచివేతలకు వ్యతిరేకంగా సీఐటీయూ పోరాడుతున్నదని తెలిపారు. అనేక మంది సామాజిక ఉద్యమకారులు సాధించాల్సిన లక్ష్యాన్ని మధ్యలోనే సాధించకుండా మరణించారనీ, వారి లక్ష్యాలను సాధించేందుకు పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో విప్లవం రావాలనీ, సమసమాజ నిర్మాణం కావాలనీ, సోషలిజం సాగించాలనే విప్లవకర కార్మిక సంఘంగా సీఐటీయూ స్థాపించబడిందని గుర్తు చేశారు. విచ్ఛిన్నకారులు, మతోన్మాదులు కులదురంకారంతో పెత్తందారులు కార్మికవర్గ లక్ష్యానికి ఆటంకంగా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వినియోగించుకుంటున్నారని విమర్శించారు. దేశంలో విప్లవం సాధించాలంటే కేవలం ఆర్థిక సమస్యలకే పరిమితమైతే విప్లవం సాధించలేమనే విషయంలో బీటీ రణదివే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. కాబట్టి కార్మికవర్గ ఐక్యతను సాధించాలంటే, కులమనే కంచెను దాటాలంటే సామాజిక సమస్యలను కూడా జోడించి ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్న అన్ని రకాల రుగ్మతలు, వివక్షలు, దోపిడీలు అంతం కావాలని ఫూలే ఆశించారో, వాటి కోసం సీఐటీయూ పోరాడుతుందని చెప్పారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సెమినార్లు, సామాజిక ఉద్యమ నిధి సేకరణ, సామాజిక ఉద్యమాలకు అండగా ఉండాలని నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యమ్రంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు కూరపాటి రమేష్‌, పుప్పాల శ్రీకాంత్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఎ.సునీత, ఆర్టీసీఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -