కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-అంబర్‌పేట
ఆధునిక సమాజపు కాంతి రేఖ జ్యోతిబా ఫూలే అని, అసమానతల అంతానికి ఆయన చేసిన కృషి.. సేవలు చిరస్మరనీయమని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అన్నారు. హైదరాబాద్ అంబర్‌పేటలో శనివారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించి.. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. మనుషులందరూ సమానమేనని చాటిచెప్పి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా.. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఫూలే స్ఫూర్తితో కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళా విద్య, సాధికారత ఉద్యమంలో పూలే ఒక మార్గదర్శక వ్యక్తి అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నూతన జాతీయ విద్యా విధానం పేరిట అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బలహీనవర్గాలకు బడ్జెట్లో, రిజర్వేషన్లలో తీరని అన్యాయం చేస్తున్నదన్నారు. ఫూలే ఆశయాల సాధన కోసం అట్టడుగు వర్గాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ సీనియర్ నాయకులు ఎం.మహేందర్, నగర కార్యదర్శి బి.సుబ్బారావు, సీఐటీయూ అంబర్‌పేట జోన్ కార్యదర్శి జి.రాములు, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు నాగేందర్, కేవీపీఎస్ అంబర్‌పేట జోన్ నాయకులు అర్జున్, ఆంజనేయులు, కిషన్, శ్రీనివాస్, గోపి, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక సమాజపు కాంతి రేఖ జ్యోతిబా ఫూలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



